#GunturKaaram:ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా, సంక్రాంతికి మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేయచ్చు

Published : Jan 11, 2024, 11:28 AM IST
 #GunturKaaram:ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా, సంక్రాంతికి మూడు రోజుల్లో ఎంత  కలెక్ట్ చేయచ్చు

సారాంశం

 సినిమాకు ఓ మాదిరి టాక్ వస్తేనే ఈ లెక్కలు అని, ఇక టాక్ అదిరిపోతే ఇంక ఈలెక్కలు పనికిరావని చెప్తున్నారు. అయితే ఈ ట్రేడ్ లెక్కలు ఏ మేరకు నిజం అవుతాయనేది మరో ఇరవై నాలుగు గంటల్లో తేలిపోతుంది.  


మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోయే  ' గుంటూరు కారం' రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఘాటెక్కిస్తోంది. ఇప్పటికే గుంటూరు కారం పాటలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా, 'కుర్చీ మడతపెట్టి' అంటూ సాగే మాస్ సాంగ్ విశేషంగా అలరిస్తోంది.  ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ మహేశ్ బాబు ఈ పాట గురించి ప్రస్తావించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనకు బ్రదర్ లాంటి వాడని, తాను, త్రివిక్రమ్ ఇచ్చిన సూచనలతో 'కుర్చీ మడతపెట్టి' పాటను కంపోజ్ చేశాడని మహేశ్ బాబు వెల్లడించారు. గుంటూరు కారం చిత్రంలో ఈ పాట వచ్చినప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని అన్నారు. ఈ పాట కోసం, మహేష్ చెప్పే డైలాగులు, ఫైట్స్ కోసం ప్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ డే సెన్సేషనల్ ఓపినింగ్స్ వస్తాయని అంచనా. మరి ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయబోతోందనే ట్రేడ్ లెక్కలు చూస్తే...

ఈ సినిమాకు మొదటి రోజు  40Cr ఓపినింగ్స్ తెచ్చుకుంటుందని లెక్క వేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుక్కింగ్ లతో 20 కోట్ల లెక్క తేలిపోయింది. మరో ఇరవై కోట్లు మిగతా టిక్కెట్ల నుంచి రాబోతున్నాయి. ఇక ఈ సంక్రాంతి  ఫెస్టివల్ మూడు రోజుల్లోనూ 80Cr వరకూ వస్తాయని లెక్క వేస్తున్నారు. సినిమాకు ఓ మాదిరి టాక్ వస్తేనే ఈ లెక్కలు అని, ఇక టాక్ అదిరిపోతే ఇంక ఈలెక్కలు పనికిరావని చెప్తున్నారు. అయితే ఈ ట్రేడ్ లెక్కలు ఏ మేరకు నిజం అవుతాయనేది మరో ఇరవై నాలుగు గంటల్లో తేలిపోతుంది.  
  
 మరో ప్రక్క ఈ సినిమా టిక్కెట్‌ ధరల పెంపునకు తెలంగాణా ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్‌ థియేటర్లలో రూ.100 పెంచేందుకు వెసులుబాటు కల్పించింది. మహేష్‌ అభిమానులను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్‌ షోల ప్రదర్శనకు కూడా అంగీకరించింది. రాష్ట్రంలో 23 చోట్ల ఈనెల 12న అర్థరాత్రి 1 గంట షో ప్రదర్శించనున్నారు. పండుగ సందర్భంగా గుంటూరుకారం ఆరో షో ప్రదర్శనకు కూడా అనుమతించింది. 12 నుంచి 18 వరకూ ఉదయం షోలను ప్రదర్శించనున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయకులు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌; జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు.

ఏదైమైనా ఈ సంక్రాంతికి  ఘాటుతో పసందైన దమ్‌ మసాలా బిర్యానీ వడ్డించేందుకు సిద్ధమవు  తున్నారు మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందిన ఈ మాస్‌ యాక్షన్‌ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘‘సర్రు మండుతాది బాబు గొడ్డు కారం.. గిర్ర తిరుగుతాది ఈడి తోటి బేరం’’ అనే పాట ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఆ పాటను పాడేసుకుంటూ అడ్వాన్స్ బుక్కింగ్స్ తో హోరెత్తిస్తున్నారు అబిమానులు.  
  
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌