నా ఫ్యాంట్ కిందకి లాగేసి మీద పడి.. నటి ఆవేదన!

By Udayavani DhuliFirst Published Oct 16, 2018, 9:55 AM IST
Highlights

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మహిళలు తము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. 

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మహిళలు తము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. తాజాగా నటి కృతిక కాస్టింగ్ డైరెక్టర్ విక్కీ సిదానా తనపై చేసిన లైంగిక దాడి గురించి వెల్లడించింది.

''ఐదేళ్ల క్రితం ఓ ఆడిషన్ లో కాస్టింగ్ డైరెక్టర్ విక్కీ సిదానాను కలిశాను. నీకు సినిమా అవకాశాలు ఇప్పిస్తే నాకు ఏంటని అడిగాడు. అవకాశాలు కావాలంటే కొద్దిరోజులు తన ఇంట్లో ఉండాలని చెప్పాడు. అతని భార్య కూడా ఇంట్లోనే ఉంటుందనే ధైర్యంతో దానికి ఒప్పుకున్నా.. అయితే ఇంట్లో నాతో అవహేళనగా మాట్లాడేవాడు. నువ్వు చాలా సన్నగా ఉన్నావు. కనీసం B**Bs కూడా లేవు.

ఇండస్ట్రీకి పనిచేయవని కించపరిచేవాడు. ఓ రోజు ఒకరిని కలవాలని చెప్పి ఓ ఇంటికి తీసుకెళ్లాడు.  ఆ ఇంట్లోకి వెళ్లగానే తలుపులేసి నన్ను బెడ్ మీదకు తోశాడు. బలవంతగా నా ఫ్యాంట్ కిందకు లాగేసి మీద పడి అత్యాచారం చేయబోయడు.

నన్ను వదిలిపెట్టు అని మొత్తుకున్నా ఒప్పుకోలేదు. మరింత మీదకు వచ్చి ఒత్తిడి చేయబోయాడు. నేను ఇతరులతో పడుకుని అవకాశాలు సంపాదించాలని రాలేదని, నీ మీద నమ్మకంతో వచ్చానని వేడుకుంటే అప్పుడు నన్ను వదిలేసి వెళ్లిపోమన్నాడు'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు.. 

లైంగిక ఆరోపణలతో అనారోగ్యం బారిన పడ్డ నటుడు!

‘‘రేప్ జరిగిందేమో.. కానీ నేను చేయలేదు’’

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!

బడా డైరెక్టర్ పై అత్యాచారం ఆరోపణలు!

click me!