ఇటీవల సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం ‘దసరా’ మూవీ ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
‘మహానటి’తో నేషనల్ అవార్డు దక్కించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో హవా చేస్తున్నారు. చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ‘దసరా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నేచురల్ స్టార్ నాని న(Nani) సరసన మరోసారి నటించి ఆకట్టుకోబోతోంది. మార్చి 30న Dasara ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తోంది.
నాని కేరీర్ లోనే తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో ‘దసరా’ చిత్రాన్ని విడుదల చేయబోతుండటంతో ప్రమోషన్స్ ను చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూలు, ఈవెంట్లు నిర్వహిస్తూ సినిమాను ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ముంబైలో నిర్వహించిన ప్రమోషన్స్ లో నాని, కీర్తి సురేష్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి రానా దగ్గుబాటి కూడా హాజరై సందడి చేశారు.
ఈ వీడియోలో యాంకర్ కాస్ట్ తో తాటికల్లు తాగించే టాస్క్ ఇస్తాడు. ఇందుకు నాని, రానా మినీ బాటిళ్లతో తాగేస్తారు. ఇదే సమయంలో కీర్తి సురేష్ వాళ్లిద్దరికీ బాటిళ్లలో సర్వ్ చేసి తానూ ఓ బాటిల్ లో కల్లు తీసుకొని తాగేస్తుంది. ఎత్తిన బాటిల్ దించకుండా తాగి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రానా, నాని సైతం కీర్తి కళ్లు తాగడంతో షాక్ అయ్యారు. ఈ వీడియోను చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకోగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ‘దసరా’ చిత్రం రూపుదిద్దుకుంది. నాని - కీర్తి సురేష్ మరోసారి జంటగా నటిస్తున్నారు. గోదావరిలోని సింగరేణి కోల్ మైన్స్, పరిసర ప్రాంతంలోని ఓ గ్రామ నేపథ్యంలో చిత్రం తెరకెక్కుతోంది. మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ర చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఇక కీర్తి సురేష్ చిరు నటిస్తున్న ‘భోళా శంకర్‘లో కీలక పాత్ర పోషిస్తోంది. అటు తమిళంలోనూ ఆయా చిత్రాల్లో నటిస్తోంది.
storm in Mumbai as the crazy trio , & recreate the hookstep of the Mass Song ❤️💃🏾 video song out today at 5:04 PM 🔥 pic.twitter.com/1E7Q1qGJhm
— SLV Cinemas (@SLVCinemasOffl)