బిగ్ బాస్ హౌస్ లో లైంగిక వేధింపులు.. నటి కామెంట్స్!

Published : Feb 12, 2019, 01:49 PM IST
బిగ్ బాస్ హౌస్ లో లైంగిక వేధింపులు.. నటి కామెంట్స్!

సారాంశం

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి కవితా గౌడ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి కవితా గౌడ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కన్నడ బిగ్ బాస్ షోలో కంటెస్టంట్ గా పాల్గొన్న కవితా తన తోటి పోటీదారుడు యాండీపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

పోటీల్లో పాల్గొన్న యాండీ తనపట్ల సరిగ్గా వ్యవహరించలేదని అన్నారు. హౌస్ లో ఉన్నంతకాలం అతడి ప్రవర్తన అలానే ఉండడంతో కన్ఫెషన్ రూమ్ లో చెప్పినట్లు కానీ ఆటలో ఇలాంటివి కామన్ అని చెప్పడంతోసైలెంట్ గా ఉన్నానని చెప్పింది.

తనకు జరిగిన అన్యాయాన్ని ప్రోగ్రాం ప్రొడ్యూసర్ గురుదాస్ శనైకి వివరించినట్లు తెలిపింది. రెండు రోజుల పాటు జరిగిన సూపర్ హీరో వర్సెస్ సూపర్ విలన్ టాస్క్ లో యాండీ కావాలని తనను టార్గెట్ చేసి మరీ లైంగికంగా హింసించినట్లు ఆరోపించారు. బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన తరువాతే ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ విషయంపై స్పందించిన యాండీ హౌస్ నుండి బయటకి వెళ్లిన తరువాత కవిత తనను కలవలేదని, బిగ్ బాస్ పోటీలలో ఓటమిని తట్టుకోలేక తనపై ఇటువంటి ఆరోపణలను చేస్తుందని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

దళపతి విజయ్ కి కోర్టులో ఎదురుదెబ్బ... జన నాయగన్‌కు సెన్సార్ కష్టాలు, నెక్స్ట్ ఏంటి?
Chiraneevi: తన విలన్ ప్రాణాలు కాపాడడానికి 60 లక్షల రూపాయలు ఖర్చుపెట్టిన చిరంజీవి