అనసూయని 'ఆంటీ' అని పిలుస్తున్నారంటే రెండు కారణాల వల్లే.. అది డర్టీ మీనింగ్, నటి కస్తూరి కామెంట్స్ వైరల్

By Asianet News  |  First Published Feb 26, 2023, 4:07 PM IST

నటి కస్తూరి పేరు చెప్పగానే అన్నమయ్య, భారతీయుడు లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. తమిళ తెలుగు భాషల్లో కథానాయికగా ఆమె అనేక చిత్రాల్లో నటించారు.


నటి కస్తూరి పేరు చెప్పగానే అన్నమయ్య, భారతీయుడు లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. తమిళ తెలుగు భాషల్లో కథానాయికగా ఆమె అనేక చిత్రాల్లో నటించారు. నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కస్తూరి అవకాశం ఉన్నప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అంతే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లో కస్తూరి బుల్లితెరపై సూపర్ క్రేజ్ పొందారు. 

ఆమె నటిస్తున్న గృహలక్ష్మి టీవీ సీరియల్ సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. దీనితో ఆమె తెలుగువారందరికీ గృహాలక్ష్మిగా మారిపోయారు. దాదాపు ఐదు పదుల వయసులో కూడా నటి కస్తూరి అందమైన ఇన్స్టా రీల్స్, హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. తరచుగా వార్తల్లో నిలిచే కస్తూరి తాజాగా ఇంటర్వ్యూలో సంచలన విషయాలపై స్పందించారు. 

Tap to resize

Latest Videos

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్ అనసూయ తరచుగా ట్రోలర్స్ బారిన పడడం చూస్తూనే ఉన్నాం. అనసూయని నెటిజన్లు ఆంటీ అని పిలవడంతో ఇటీవల పెద్ద వివాదమే జరిగింది. అనసూయ వరుసగా పోస్ట్ లు పెడుతూ ఘాటుగా స్పందించింది. తాజాగా ఈ వివాదం గురించి ఇంటర్వ్యూలో కస్తూరిని ప్రశ్నించారు. మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అని పిలిస్తే ఎలా స్పందిస్తారు అని అడిగారు. 

undefined

దీనికి కస్తూరి బదులిస్తూ.. మమల్ని చిన్న పిల్లలు ఆంటీ అని పిలవడానికి.. పెద్దవాళ్ళు పిలవడానికి చాలా తేడా ఉంది. మీరు అడల్ట్ అయితే ఒక మహిళని ఆంటీ అని పిలవడం సరైన పద్దతి కాదు.. ఒక నటుడినో లేదా హీరోనో వాళ్ళు వయసైనవాళ్లు అయినప్పటికీ వెళ్లి అంకుల్ అని పిలవగలరా ? అని కస్తూరి ప్రశ్నించారు. ఆంటీ అనే పదానికి ఇప్పటికే ఒక డర్టీ మీనింగ్ వచ్చేసింది. 

అనసూయ కన్నా వయసులో రెట్టింపు ఏజ్ ఉన్న నటులు ఉన్నారు. వారిని అంకుల్ అని పిలవండి.. పిలవగలరా ? నాన్సెన్స్.. ఆంటీ అని పిలుస్తున్నారు అంటే రెండే కారణాలు.. వారి మైండ్ లో డర్టీ థాట్స్ అయినా ఉండాలి లేదా అవమానించే విధంగా అయినా పిలవాలి. ఈ వివాదంలో నేను అనసూయకి మద్దతు ఇస్తున్నా అని కస్తూరి అన్నారు. 

click me!