బీజేపీలో చేరిన నటి కరాటే కళ్యాణి.. విజయశాంతిపై కామెంట్స్, ఎమోషనల్ గా

By telugu teamFirst Published Aug 15, 2021, 8:42 PM IST
Highlights

నటి కరాటే కళ్యాణి టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కామెడీ రోల్స్, నాటీ రోల్స్ తో కరాటే కళ్యాణి ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే.

నటి కరాటే కళ్యాణి టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కామెడీ రోల్స్, నాటీ రోల్స్ తో కరాటే కళ్యాణి ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ మిరపకాయ్ చిత్రంలో 'అబ్బ' అంటూ కరాటే కళ్యాణి చెప్పిన డైలాగ్ కడుపుబ్బా నవ్వించింది. 

కృష్ణ, అ..ఆ, నేను లోకల్ లాంటి చిత్రాల్లో నటించింది. కరాటే కళ్యాణి టాలీవుడ్ కార్యక్రమాలలో, మా అసోసియేషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా కరాటే కళ్యాణి భారతీయ జనతా పార్టీలో చేరింది. పాలిటిక్స్ వైపు తొలి అడుగు వేసింది. 

టాలీవుడ్ కు చెందిన పలువురు నటీమణులు ప్రస్తుతం వివిధ పార్టీల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరాటే కళ్యాణి.. విజయశాంతి సమక్షంలో బీజేపీలో చేరారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా వేదికపై కళ్యాణి దేశభక్తి పాట పాడి మెప్పించారు. అలాగే విజయశాంతి, బండి సంజయ్, బిజెపి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. చిత్ర పరిశ్రమ నుంచి మెరిసిన ధృవతార విజయశాంతి మేడం. ఆమె పాటలు వింటూ పెరిగాం. అలాగే బండి సంజయ్ గారు రాష్ట్రంలో పార్టీని ఓకే బండిలా చక్కటి మార్గంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. 

బిజెపిలో చేరడానికి ఈ స్వాతంత్ర దినోత్సవమే మంచి తరుణం అనిపించింది అని కరాటే కళ్యాణి అన్నారు. జై శ్రీరామ్ అంటే బీజేపీలో చేరిపోవచ్చని అనుకుంటారు. కానీ ధర్మాన్ని పాటించే ఈ పార్టీలో చేరాలంటే క్రమశిక్షణ అవసరం అని కళ్యాణి తెలిపారు. 

click me!