కవల పిల్లలతో మొదటిసారి బయట కనిపించిన నయనతార- విగ్నేష్ శివన్, వైరల్ అవుతున్న ఫోటో

Published : Mar 09, 2023, 02:24 PM ISTUpdated : Mar 09, 2023, 02:26 PM IST
కవల పిల్లలతో మొదటిసారి బయట కనిపించిన నయనతార- విగ్నేష్ శివన్, వైరల్ అవుతున్న ఫోటో

సారాంశం

మొదటిసారి ఇద్దరు పిల్లలు..భర్తతో కలిసి  బయట కనిపించింది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార.  పెళ్ళి , పిల్లల తరువాత పెద్దగా బయట కనిపించని నయన్..కెమెరా కళ్ళకు చిక్కింది. 

ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సీనియర్ బ్యూటీ..తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసింది. కెరీర్ లో ఇద్దరు హీరోలను ప్రేమించి పెళ్లి వరకూ వెళ్లకుండానే బ్రేకప్ చెప్పిన నయనతార.. చివరకు యంగ్ డైరెక్టర్  విగ్నేష్ శివన్ ని.. దాదాపు ఐదేళ్లు ప్రేమించి.. సహజీవనం చేసి..  పెళ్లి చేసుకుంది.  పోయిన ఏడాది వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక పెళ్ళి జరిగిన కొన్ని నెలలకే సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిగా మారి, అందరికి షాక్ ఇచ్చింది బ్యూటీ.  సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద వివాదంగా కూడా మారింది. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోలేదు అంటూ పెద్ద వివాదం అయ్యి.. ఆతరువాత క్లీన్ చిట్ కూడా వచ్చింది ఈ దంపతులకు. 

ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ.. ఇద్దరు పిల్లలకి తల్లిగా ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తూ.. బిజీగా ఉంది నయన్.  రీసెంట్ గా  కనెక్ట్ అనే హారర్, థ్రిల్లర్ సినిమాతో ఆడియన్స్ ను మెప్పించింది బ్యూటీ. అయితే నయనతార -విఘ్నేష్ శివన్ లు ఎవరికి వారు బయటక కనిపిస్తున్నారు కాని.. వారి పిల్లలు మాత్రం ఇప్పటి వరకూ బయట కనిపించలేదు. వారిని కెమెరా కళ్లకు చిక్కకుండా పెంచుతున్నారు స్టార్ జంట. అయితే ఎంత దాచాలి అనుకున్నా.. ఎప్పుడో ఒకప్పుడు చూపించకతప్పదు కదా. వాళ్లు చూపించకపోయినా.. మీడియా ఎలాగో అలా వారిని చూడకుండా ఉండదు కదా..? రీసెంట్ గా అదే జరిగింది. 

 

నయన్ – విగ్నేష్ పిల్లలు పుట్టినప్పుడు కేవలం వాళ్ళ కాళ్ళు, చేతులు మాత్రమే కనపడేలా ఫోటోలు పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా వాళ్ళ పిల్లలతో నయన్, విగ్నేష్ బయట కనపడలేదు. సోషల్ మీడియాలో కూడా వారి కంప్లీట్ ఫోటోలు శేర్ చేయలేదు స్టార్ కపుల్.  తాజాగా నయన్, విగ్నేష్ దంపతులు తమ కవల పిల్లలతో ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దీంతో  మీడియా వాళ్ళ కెమెరాలకు పనిచేప్పారు. స్టార్ కపుల్  వెంట పడ్డారు. ఇద్దరూ చెరో బాబుని ఎత్తుకొని కారులోంచి దిగి హడావిడిగా ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళిపోయారు. 

 

పిల్లలతో ఈ నయనతార, విఘ్నేష్ కనిపించారు కాని.. వారి  ఫేస్ లు మాత్రం  కనిపించకుండా జాగ్రత్త పడ్డారు జంట. దీంతో నయన్, విగ్నేష్ తమ కవల పిల్లల్ని ఎత్తుకొని వెళ్లిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పిల్లలిద్దరికీ ఒకే రకం డ్రెస్సు వేయడం, నయనతార ఫ్యాషన్ వేర్ లో దర్శనం ఇచ్చారు. ఇక ఈ వీడియోలు, ఫోటోలు చూసిన అభిమానలు.. పిల్లలను ఎప్పుడు పరిచయం చేస్తారంటూ కామెంట్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది