బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) వరుస ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ‘దడఖ్’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ‘మిలీ’ వంటి చిత్రాలతో అలరించింది. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్ లో నటిగా స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
తాజాగా జాన్వీ కపూర్ నటిస్తున్న కొత్త చిత్రం ఉలజ్ (Ulajh). ఈ చిత్రానికి సుధాన్షు సరియా దర్శకత్వం వహించనున్నారు. ఆమె రోషన్ మాథ్యూ మరియు గుల్షన్ దేవయ్యతో కలిసి నటిస్తున్నారు. ఈరోజు చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ ఆసక్తిని పెంచేలా ఉంది. చిత్రంలో జాన్వీ కపూర్ IFS (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారిణి పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. చిత్ర షూటింగ్ నెలాఖరులో జరగనున్నందని కూడా ప్రకటించింది.
ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. పేట్రియాటిక్ థ్రిల్లర్ యొక్క ఫస్ట్ లుక్‌లో, జాన్వీ కపూర్ మధ్యలో నిలబడి ఉండగా, గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేష్ తైలాంగ్, మీయాంగ్ చాంగ్, సచిన్ ఖేడేకర్, రాజేంద్ర గుప్తా మరియు జితేంద్ర జోషి ఆమెకు రెండు వైపులా నిలబడి ఉన్నారు. ప్రస్తుతం పోస్టర్ వైరల్ గా మారింది.
‘ఉలాజ్’ స్క్రిప్ట్ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ కు సంబంధించిన ప్రపంచాన్ని పరిచయం చేయనుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడారు. ఉలజ్ స్క్రిప్ట్ బాగుందని తెలిపింది. నటిగా నా కంఫర్ట్ జోన్ నుండి బయటపడటానికి అందుకు తగిన పాత్రల కోసం నిరంతరం వెతుకుతున్నాను. సినిమా పేరు సూచించినట్లుగానే నా పాత్ర మరియు కథ చాలా పొరలుగా, భావోద్వేగాలతో, పారామీటర్‌లను కలిగి ఉంది. ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్ గానూ, ఉత్తేజకరంగానూ ఉంది. ఈ చిత్రానికి పర్వీజ్ షేక్ మరియు సుధాన్షు సరియా కథ అందించారు.. జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
జాన్వీ చేతిలో మరో రెండు హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. ‘మిస్టర్ అండ్ మిస్ మహి’ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరనన NTR30లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో టాలీవుడ్ కు గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ క్రమంలో ‘ఉలజ్’ చిత్రం కూడా పట్టాలెక్కబోతోంది. మొత్తానికి జాన్వీ విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది.