సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ (Soundarya Rajinikanth) తాజాగా పోలీసులను ఆశ్రయించింది. ఈమేరకు న్యూస్ వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికొస్తే..
ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ (Rajinikanth) రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) కారు కీస్ మిస్ అయ్యాయని పోలీసులకు కంప్లైట్ చేసింది. చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, సౌందర్య రజనీకాంత్ ఓ ప్రైవేట్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి మరో కారులో వెళ్లారు. ఈక్రమంలోనే తన రేంజ్ రోవర్ కారు తాళం చెవి పోగొట్టుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సిటీ పోలీస్ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక రెండు నెలల కింద చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో సౌందర్య సోదరి, రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) ఇంట్లో బంగారు ఆభరణాలు, వజ్రాలు దొంగిలించినందుకు గాను ఇంటి పనిమనిషిని, డ్రైవర్ ను తేనాంపేట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఇలా మరోసారి రజినీకాంత్ కూతురు పోలీసులను ఆశ్రయించడంతో న్యూస్ వైరల్ గా మారింది. సౌందర్య రజినీకాంత్ కూడా సినీ పరిశ్రమలోనే పనిచేస్తున్నారు. గ్రాఫిక్ డిజైనర్ గా చాలా సినిమాలకు వర్క్ చేశారు. ఆమెకు రెండు వివాహాలు జరిగాయి. మొదటి భర్త అశ్విన్ రామ్ కుమర్ తో పలు వివాదాలతో 2017లో విడిపోయింది. ఆ తర్వాత 2019లో విశగన్ ను పెళ్లి చేసుకుంది. సౌందర్య ఇద్దరు పిల్లలున్నారు.
రజినీకాంత్ ప్రస్తుతం వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. భారీ సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోలతో పోటీపడుతున్నారు. రజినీ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా భాటియా హీరోయిన్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలోని ‘లాల్ సలామ్’లో కీలక పాత్రలో నటించబోతున్నారు.