అనుష్క కోసం పాట పాడబోతున్న స్టార్ హీరో.. యూట్యూబ్ రికార్డులు గల్లంతే

By Asianet News  |  First Published May 10, 2023, 1:52 PM IST

ప్రస్తుతం అనుష్క శెట్టి.. నవీన్ పోలిశెట్టి జంటగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రంలో నటిస్తున్నారు. పి మహేష్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.


లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ ని అలరించిన అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి, నిశ్శబ్దం రెండు చిత్రాలు మాత్రమే చేసింది. ప్రస్తుతం అనుష్క శెట్టి.. నవీన్ పోలిశెట్టి జంటగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రంలో నటిస్తున్నారు. 

పి మహేష్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్స్ తో యువ హీరో నవీన్ పోలిశెట్టి జోరుమీదున్నాడు. అలాంటి హీరో సరసన అనుష్క శెట్టి జత కట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

Latest Videos

ఇటీవల విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిచిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో స్టార్ హీరో ధనుష్ ఓ పాట పాడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంగీత దర్శకుడు రధాన్ త్వరలో ధనుష్ పాడే పాటని రికార్డ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ధనుష్ పాటలు పాడడం కొత్తేమి కాదు. గతంలో తన చిత్రాలతో పాటు ఇతరుల చిత్రాల్లో కూడా పాటలు పాడారు. 3 మూవీలో వై థిస్ కొలవెరి అంటూ ధనుష్ పాడిన పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. సాయిధరమ్ తేజ్ తిక్క చిత్రంలో కూడా ధనుష్ పాట పాడారు. ఇప్పుడు అనుష్క చిత్రం కోసం ధనుష్ పాట పాడితే యూట్యూబ్ రికార్డులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ న్యూస్ ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

click me!