వాడుకుని వదిలేశాడు… మాజీ మంత్రిపై న‌టి ఆరోప‌ణ‌లు

By Surya PrakashFirst Published May 29, 2021, 2:58 PM IST
Highlights

గత ఐదేళ్లుగా శారీరంగా వాడుకుంటూ ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే తన వీడియోలు బయిటపెడతానని బెదిరిస్తున్నాడంటూ మాజీ మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసింది నటి చాందిని.

ఓ మాజీ మంత్రి రాసలీలల బాగోతాన్ని బట్టబయలు చేసింది సినీ నటి చాందిని. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి.. గత ఐదేళ్లుగా శారీరంగా వాడుకుంటూ ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే తన వీడియోలు బయిటపెడతానని బెదిరిస్తున్నాడంటూ మాజీ మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసింది నటి చాందిని.

వివరాల్లోకి వెళితే...త‌మిళ‌నాడుకి చెందిన మాజీ మంత్రి మ‌ణికంద‌న్ త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేశాడంటూ వ‌ర్ధ‌మాన న‌టి చాందిని చెన్నై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రితో త‌న‌కు ఐదేళ్ల ప‌రిచ‌యం ఉంద‌ని, స‌న్నిహితంగా మెలిగామ‌ని, అప్ప‌ట్లో పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పిన మ‌ణికంద‌న్ ఇప్పుడు నిరాక‌రిస్తున్నాడని, బెదిరిస్తున్నాడని పేర్కొంది. మణికందన్ తనతో కలిసి ఉన్నారని చెప్పేందుకు సాక్ష్యాలు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపింది. ఈ క్రమంలో తాను మూడుసార్లు గర్భవతిని అయ్యానని, అయితే అధికారికంగా పెళ్లి చేసుకున్న తర్వాతే పిల్లల్ని కందామని అబార్షన్ చేయించాడని శాంతిని పేర్కొంది. ఇప్పుడు దేశం విడిచి వెళ్లకపోతే ప్రైవేటు ఫొటోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడని పేర్కొంది. త‌నకు న్యాయం జ‌రిగే వ‌రకు వ‌ద‌ల‌న‌ని స్ప‌ష్టం చేసింది.
 
నోమాడ్స్ చిత్రంతో క్రేజ్ దక్కించుకున్న నటి చాందిని.. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో మంత్రితో పరిచయం ఏర్పడగా.. అది సహజీవనానికి దారితీసింది. గత ఐదేళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెబుతూ తనతో కాపురం చేస్తున్నాడని.. అయితే ఎంతకాలం ఇలా అని అడిగేసరికి ఇప్పుడు పెళ్లికి  అంగీకరించడం లేదని నటి చాందిన ఆరోపించింది. తన మీద మోజు తీరిపోవడం పెళ్లికి నిరాకరిస్తున్నాడని.. పెళ్లి చేసుకుంటావా లేదా అని నిలదీసినందుకు ఇద్దరం ఏకాంతంగా గడిపిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిస్తా అని బెదిరిస్తున్నాడని.. రౌడీలతో దాడి చేయించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది చాందిని.

మరోవైపు చాందిన త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని మాజీ మంత్రి మణికందన్ అన్నారు. ఆమెపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని స్పష్టం చేశారు. కాగా, తమిళనాడులోని రామాథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మణికందన్.. జయలలిత సీఎంగా ఉన్న సమయంలో ఐటీ శాఖామంత్రిగా పనిచేశారు. అయితే జయలలిత మరణం తరువాత చిన్నమ్మ శశికళకి ముఖ్య అనుచరుడిగా మారారు. 

click me!