పరిశ్రమలో విషాదం... కరోనా సోకి ప్రముఖ నిర్మాత దుర్మరణం!

Published : May 29, 2021, 02:24 PM IST
పరిశ్రమలో విషాదం... కరోనా సోకి ప్రముఖ నిర్మాత దుర్మరణం!

సారాంశం

బాలీవుడ్ నిర్మాత రియాన్ ఇవాన్ స్టీపెన్ అకాల మరణం పొందారు. కరోనా బారినపడి ఆయన మరణించడం జరిగింది. కొద్దిరోజుల క్రితం వైద్య పరీక్షల్లో రియాన్ ఇవాన్ కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 

కరోనా వైరస్ ఏడాది కాలంగా అనేక మంది సినిమా ప్రముఖుల ఉసురు తీసింది. మహమ్మారి బారిన పడి పలువురు అకాల మరణం పొందారు. రెండు నెలల క్రితం ప్రారంభమైన కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకారిగా మారింది. రోజుల వ్యవధిలో వివిధ పరిశ్రమలకు చెందిన చిత్ర ప్రముఖులు కరోనా సోకి మరణించారు. ప్రతి రోజూ ఒకరిద్దరు చిత్ర ప్రముఖులు కరోనాకు బలికావడం అత్యంత బాధాకరం. 


తాజాగా బాలీవుడ్ నిర్మాత రియాన్ ఇవాన్ స్టీపెన్ అకాల మరణం పొందారు. కరోనా బారినపడి ఆయన మరణించడం జరిగింది. కొద్దిరోజుల క్రితం వైద్య పరీక్షల్లో రియాన్ ఇవాన్ కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీనితో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే వైరస్ ప్రభావం ఎక్కవై పరిస్థితి విషమించి ఆయన ప్రాణాలు విడిచారు. 


కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కిన ఇందుకీ జవానీ చిత్రాన్ని రియాన్ నిర్మించారు. అలాగే దేవి చిత్రానికి కూడా ఆయన నిర్మాతగా ఉన్నారు. ఇక రియాన్ మరణ వార్త తీసుకున్న బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కియారా, వరుణ్ ధావన్, దియా మీర్జా, మనోజ్ బాజ్ పాయ్ వంటి నటులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం ప్రకటించారు.
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?