విశాల్‌తో పెళ్లి వార్తలపై నటి అభినయ క్లారిటీ.. నా కల నెరవేరిందంటూ కామెంట్స్..

Published : Sep 02, 2023, 07:20 PM ISTUpdated : Sep 02, 2023, 07:25 PM IST
విశాల్‌తో పెళ్లి వార్తలపై నటి అభినయ క్లారిటీ.. నా కల నెరవేరిందంటూ కామెంట్స్..

సారాంశం

విశాల్‌తో నటి అభినయ పెళ్లి అనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్పందించిన ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు తన కల నెరవేరిందని చెప్పింది. 

హీరో విశాల్‌.. నటి అభినయని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఆ మధ్య చక్కర్లు కొట్టాయి. ఇద్దరు పెళ్లికి రెడీ అయ్యారని అన్నారు. దీనిపై నటి అభినయ ఇప్పటికే స్పందించింది. తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు తన తన కల నెరవేరిందని చెప్పింది. సోషల్‌ మీడియా ద్వారా ఆమె ఈ విషయాలను వెల్లడించారు. 

హీరో విశాల్‌తో కలిసి ఇప్పుడు `మార్క్ ఆంటోని` చిత్రంలో నటిస్తుంది అభినయ. ఇందులో విశాల్‌కి భార్య పాత్రలో కనిపించబోతుందట. విశాల్‌కి తాను పెద్ద అభిమానని అని, ఆయనతో కలిసి పనిచేయడం, ఆయన్ని కలవడం తన డ్రీమ్‌ అని చెప్పింది. ఇన్నాళ్లకి ఆ డ్రీమ్‌ నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. 

అభినయ చెబుతూ, చిన్నప్పట్నుంచి నాకు రజనీకాంత్‌ అంటే అభిమానమని, ఆ తర్వాత విశాల్‌ని అంతగా అభిమానించానని తెలిపింది. ఆయన నటించిన తొలి చిత్రం `ప్రేమ చదరంగం` చూసి విశాల్‌కి ఫ్యాన్‌ అయిపోయానని, జీవితంలో ఒక్కసారైనా ఆయన్ని కలవాలనుకున్నా, ఆయన నటించిన `పూజ` చిత్రంలో యాక్ట్‌ చేశానని, కానీ ఆయన్ని కలవడానికి కుదర్లేదని పేర్కొంది. ఇన్నాళ్లకి కుదిరిందని చెప్పింది. 

``మార్క్ ఆంటోని`లో విశాల్‌తో మరోసారి కలిసి పనిచేసే అవకాశం దక్కింది. ఇందులో నేను ఆయనకు భార్యగా నటించాను. ఈ సినిమా షూటింగ్‌లోనే తాను మొదటిసారి విశాల్‌ని కలిశాను. నా కల నెరవేరిన రోజది. చాలా హ్యాపీగా ఉంది. విశాల్‌కి కోపం ఎక్కువ అని అనుకునేదాన్ని. కానీ ఆయన్ని కలిసిన తర్వాత ఆయన ఎంత మంచి వారో తెలిసింది. ఎదుటి వ్యక్తులకు ఎప్పుడూ తన వంతు సాయం చేస్తూనే ఉంటారు. అనందరి సమానంగా చూస్తార`ని చెప్పింది. 

ఈ సందర్భంగా విశాల్‌తో పెళ్లి రూమర్లపై ఆమె మరోసారి రియాక్ట్ అవుతూ, విశాల్‌కి, నాకు వివాహం జరుగుతుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. చాలా మంది మేమిద్దరం రిలేషన్‌లో ఉన్నామంటున్నారు. అదంతా అవాస్తవమే` అని చెప్పింది అభినయ. విశాల్‌ హీరోగా నటించిన `మార్క్ ఆంటోని` చిత్రం ఈ నెల 15న వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోతుంది. రేపు ట్రైలర్‌ని రిలీజ్‌ చేయబోతున్నారు.  అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్‌ కాబోతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్