నటుడు వివేక్ మరణానికి కారణం ఇదే, వ్యాక్సిన్ కాదు.. తేల్చిన కేంద్ర ఆరోగ్య శాఖ

pratap reddy   | Asianet News
Published : Oct 22, 2021, 07:40 PM IST
నటుడు వివేక్ మరణానికి కారణం ఇదే, వ్యాక్సిన్ కాదు.. తేల్చిన కేంద్ర ఆరోగ్య శాఖ

సారాంశం

ప్రముఖ తమిళ నటుడు వివేక్ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు. డబ్బింగ్ చిత్రాల ద్వారా వివేక్ తెలుగులో కూడా గుర్తింపు పొందారు. అపరిచితుడు, సింగం లాంటి పాపులర్ మూవీస్ లో వివేక్ నటించారు.

ప్రముఖ తమిళ నటుడు వివేక్ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు. డబ్బింగ్ చిత్రాల ద్వారా వివేక్ తెలుగులో కూడా గుర్తింపు పొందారు. అపరిచితుడు, సింగం లాంటి పాపులర్ మూవీస్ లో వివేక్ నటించారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 17న వివేక్ ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. వివేక్ మరణంపై అనేక వాదనలు వినిపించాయి. 

Actor Vivek మరణించడానికి రెండు రోజుల ముందే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వివేక్ మరణానికి కారణం గుండెపోటు అని వైద్యులు చెప్పినా అనుమానాలు ఆగలేదు. వ్యాక్సిన్ వికటించడం వల్లే వివేక్ మరణించి ఉంటారనే ఊహాగానాలతో మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. 

దీనితో వివేక్ మృతికి Covid Vaccine కారణమా కాదా అని తేల్చేందుకు విల్లుపురంకి చెందిన సామజిక కార్యకర్త శరవణన్ రంగంలోకి దిగారు. వివేక్ మృతిపై ఆయన మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనితో మానవహక్కుల సంఘం ఆ ఫిర్యాదుపై కేంద్ర ఆరోగ్య శాఖని వివరణ కోరింది. దీనితో కేంద్ర ప్రభుత్వ ఆద్వర్యం లోని వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ శాఖ వివేక్ మృతిపై స్టడీ చేసింది. మానవ హక్కుల సంఘానికి నివేదిక ఇచ్చింది. 

Also Read: తెలుగు అందమా అదరహో.. క్లాసీ లుక్ తో కేక పెట్టిస్తున్న ఈషా రెబ్బా, ఆగలేకపోతున్న నెటిజన్లు

ఈ నివేదికలో వివేక్ మరణానికి కరోనా వ్యాక్సిన్ ఏమాత్రం కారణం కాదని.. అధిక రక్తపోటు, కార్డియాక్ అరెస్ట్ కారణంగానే వివేక్ మరణించారని తేల్చారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న రెండు రోజులకే ఆయన మరణించడం యాదృచ్చికం అని పేర్కొన్నారు. మొదట్లో ప్రజల్లో కూడా వ్యాక్సిన్ పై అనేక అపోహలు ఉండేవి. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 100 కోట్ల డోసులు మార్క్ దాటినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు