స్టార్ కమిడియన్ కు గుండెపోటు, పరిస్థితి విషమం

Surya Prakash   | Asianet News
Published : Apr 16, 2021, 02:10 PM ISTUpdated : Apr 16, 2021, 02:11 PM IST
స్టార్ కమిడియన్ కు గుండెపోటు, పరిస్థితి విషమం

సారాంశం

 కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న వివేక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న మరుసటి రోజే వివేక్‌ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం కలకలం  రేపింది.

ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్  (59) పరిస్దితి సీరియస్ గా ఉంది. హార్ట్ ఎటాక్ తో ఆయన  ఆసపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయనకు తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో ఆయనను  శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న వివేక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న మరుసటి రోజే వివేక్‌ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం కలకలం  రేపింది.

 అయితే వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.  ప్రస్తుతం ఎక్మో ట్రీట్‌మెంట్ అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల టీమ్  ఆయన ఆరోగ్యాన్ని  నిశితంగా పర్యవేక్షిస్తోంది.  ఐసియులో చికిత్స పొందుతున్న వివేక్ గురువారమే కోవిడ్ కి వాక్సిన్ కూడా తీసుకున్నారు.   

కాగా చెన్నై ఓమందూరు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్‌ గురువారం కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా  వైద్యులు,  సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరూ ముందుకు వచ్చి కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని పిలుపు కూడా ఇచ్చారు వివేక్. కోవాక్సిన్ తో పాటు కోవీషీల్డ్ కూడా మనకు కోవిడ్ రాకుండా చేయలేనప్పటికీ... కోవిడ్ ప్రమాదస్థాయిని తగ్గిస్తాయని అన్నారు వివేక్. వందలాది చిత్రాల్లో నటించిన వివేక్ ని భారతప్రభుత్వం 2009లో పద్మశ్రీతో గౌరవించింది.  టీకా మాత్రమే మన ప్రాణాలను కాపాడుతుందంటూ ట్వీట్‌  చేసిన సంగతి తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

Rakul Preet Singh: బాలీవుడ్ లో కుట్రలు ఉంటాయి, టాలీవుడ్ లో ఐక్యత ఉంటుంది.. మంటలు రేపుతున్న రకుల్ కామెంట్స్
Operation Aruna Reddy Review: ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీ రివ్యూ.. పోసాని ఎట్టకేలకు హిట్‌ కొట్టాడా?