స్టార్ హీరో కొడుకు ఎంట్రీ ఇచ్చేశాడు!

Published : Jan 03, 2019, 10:25 AM IST
స్టార్ హీరో కొడుకు ఎంట్రీ ఇచ్చేశాడు!

సారాంశం

కోలివుడ్ అగ్ర హీరో విజయ్ కొడుకు జెసన్ సంజయ్ ఇప్పుడు నటుడిగా ఎంట్రీ ఇచ్చేశాడు. గతంలో బాలనటుడిగా తన తండ్రితో కలిసి కొన్ని సినిమాల్లో నటించిన జెసన్ సంజయ్ ఇప్పుడు 'జంక్షన్' అనే షార్ట్ ఫిల్మ్ లో లీడ్ రోల్ పోషించాడు. 

ఈ లఘు చిత్రంలో నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు. బుధవారం నాడు ఆన్ లైన్ లో విడుదల ఈ షార్ట్ ఫిల్మ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆరు నిమిషాల 51 సెకన్ల నిడివి గల ఈ లఘు చిత్రం థ్రిల్లర్ నేపధ్యంలో రూపొందించారు.

ఇందులో ఎక్కువగా 'ఎఫ్' వర్డ్స్ ని వినియోగించారు. చూస్తుంటే సంజయ్ హాలీవుడ్ చిత్రాల నుండి స్ఫూర్తి పొందినట్లుగా అనిపిస్తోంది. టైటిల్ క్రెడిట్స్ లో డైరెక్టర్ పేరు దగ్గర జె.ఎస్.జె అని రాసుంది. బహుశా ఇది సంజయ్ స్క్రీన్ నేమ్ కావొచ్చు. మరి సంజయ్ పూర్తిస్థాయి హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 39 Collections: డేంజర్‌ జోన్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌` రికార్డులు.. ధురంధర్‌ 39 రోజుల బాక్సాఫీసు వసూళ్లు
100 కోట్లు వసూలు చేసినా అట్టర్ ఫ్లాప్ అయిన స్టార్ హీరోల సినిమాలు