అనారోగ్యంపై స్పందించిన నటుడు ఉపేంద్ర.. ఏమంటున్నాడంటే!

Published : Nov 25, 2022, 06:38 PM ISTUpdated : Nov 25, 2022, 06:46 PM IST
అనారోగ్యంపై స్పందించిన నటుడు ఉపేంద్ర.. ఏమంటున్నాడంటే!

సారాంశం

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) అనారోగ్యంపై వార్తలు వస్తుండటంతో తాజాగా ఆయనే స్పందించారు. అభిమానులు ఆందోళన చెందుతుండటంతో తన ఆరోగ్యంపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.   

చిత్ర పరిశ్రమలో ఇటీవల వరుస సీనియర్ నటులు అస్వస్థతకు గురై హూఠాహుఠిన ఆస్పత్రులకు వెళ్తున్న విషయం తెలిసిందే.  బాలీవుడ్ లో సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే, కోలీవుడ్ లో  విశ్వనటుడు కమల్ హాసన్ కూడా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. టాలీవుడ్ లో యంగ్ హీరో నాగశౌర్య కూడా పెళ్లి ముందుకు ఆస్పత్రికి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ ఇండస్ట్రీలోని విలక్షణ నటుడు ఉపేంద్ర (Upendra) కూడా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

ఈ విషయం కన్నడ ఇండస్ట్రీ, బెంగళూరులో తెగ సర్యూలేట్ అయ్యింది. ఇంతకీ ఆయనకు ఏమైందనే విషయంపై అంతా విచారిస్తుండగా..  స్వయంగా ఉపేంద్రనే స్పందించి తన ఆరోగ్యంపై అప్డేట్ అందించారు. ఇందుకు సంబంధించిన ఓవీడియోను నెట్టింట వదిలారు... ఉపేంద్ర మాట్లాడుతూ ‘ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని ప్రకటించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. షూటింగ్ లోకేషన్ లో దుమ్ము ఎక్కువగా ఉండటంతో కాస్తా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. దీంతో వెంటనే ఆస్పత్రికి వచ్చి చెకప్ చేయించుకున్నట్టు’ తెలిపారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఆస్పత్రి నుంచి ఉపేంద్ర నేరుగా షూటింగ్ కే వెళ్లినట్టు తెలుస్తోంది. కన్నడ ప్రముఖ నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. కన్నడతో పాటు తెలుగులోనూ ఊపేంద్రకు అభిమానులు ఉండటం.. ఆయన సినిమాలకూ మంచి డిమాండ్ ఉండటం విశేషం. ప్రస్తుతం ఉపేంద్ర వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ‘కబ్జా’,‘త్రిశూలం’,‘యూఐ’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Deepika Padukone: పదేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకొణె హిస్టారికల్ మూవీ.. ఆమె బెస్ట్ లుక్స్ చూశారా
సుజీత్ కి పవన్ కారు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా ? అంత పెద్ద త్యాగం చేశాడా, హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే