పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, దేవుడు రాసిపెట్టాడు.. నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు

Published : Mar 25, 2023, 02:32 PM IST
పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు, దేవుడు రాసిపెట్టాడు.. నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

పవన్ కళ్యాణ్ పక్కాగా సీఎం అవుతాడన్నారు సీనియర్ నటుడు సుమన్. దేవుడు రాసి పెట్టాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ సుమన్  ఇంకేమన్నారు..? 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అభిమానులు పవన్ ను ఆంధ్రాకు సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. ఇటు పాలిటిక్స్ ను అటు మూవీస్ బ్యాలన్స్ చేస్తూ పవన్ బాగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆయన  వినోదాయ సీతమ్ రీమేక్ షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. ఈసినిమాతో పాటు మరో మూడు సినిమాలు లైన్ లో ఉంచారు పవర్ స్టార్. ఈక్రమంలో ఈఏప్రిల్ లో షూటింగ్స్ కు టైమ్ కేటాయించారు పవర్ స్టార్. 

ఇర ఈక్రమంలో టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ పవర్ స్టార్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఫిల్మ్ ఫోకస్ కథనం ప్రకారం...  పవన్ సీఎం కావాలని దేవుడు రాసిపెట్టి ఉంటాడని సుమన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈన్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీ వ్యాక్తిగా చెపుతున్నా..పవన్ కు అభిమానుల్లో ఉన్న క్రేజ్.. అంతా ఇంతా కాదు అన్నారు సుమన్. ఎక్కడికి వెళ్లిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కనిపిస్తారని.. ఆ విషయంలో ఆయన అదృష్టవంతుడు అన్నారు సుమన్. 

పాలిటిక్స్ అయినా బిజినెస్ అయినా  లక్ కలిసి రావాలి.. లాభం రాసిపెట్టి ఉండాలని ఆయన అన్నారు. దేవుడు కొంత మందికి మాత్రమే గోప్పపనులు అప్పగిస్తాడు.. అంతే కాని..ఒకరు చేసిన పనులు మరొకరు చేయలేరన్నారు. పవన్ సీఎం కావాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడని.. అది ఎప్పటికైనా జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సుమన్ ఒడిశా సీఎంను ఉదాహరణగా చెప్పారు. అక్కడ  నవీన్ పట్నాయక్ ఐదుసార్లు సీఎం అయ్యారని.. అది ఆయన ఫాలోయింగ్ అన్నారు. ఇక్కడ పవర్ స్టార్ కు ఉన్న ఫాలోయింగ్ ఎవరికీ లేదని సుమన్ అన్నారు. ఇక  పవన్ కళ్యాణ్ సీఎం అయితే ధైర్యంగా ఉంటామని ప్రజలు ఎప్పుడు అనుకుంటారో అప్పుడే ఆయన సీఎం అవుతారని సుమన్ పేర్కొన్నారు. నటుడిగా పవన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నట్టు సుమన్ పేర్కోన్నారు.  ఇక సుమన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్