తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సమంత.. ఏం చెప్పారంటే..?

Published : Mar 25, 2023, 02:25 PM ISTUpdated : Mar 25, 2023, 02:38 PM IST
తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన సమంత.. ఏం చెప్పారంటే..?

సారాంశం

ప్రముఖ సినీ నటి సమంత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

ప్రముఖ సినీ నటి సమంత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. శాకుంతలం సినిమా ప్రమోషన్ ప్రమోషన్‌లో భాగంగా యాంకర్ సుమ జరిపిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే తన ఆరోగ్యం మెరుగుపడిందని అన్నారు. గత ఇంటర్వ్యూ సమయంలో తాను చాలా వీక్‌గా ఉన్నానని గుర్తుచేశారు. ప్రస్తుతం బయటకు రాగలుగుతున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను బయటకు వచ్చి శాకుంతలం ప్రమోషన్‌లో పాల్గొంటున్నందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. 

ఇక, ఇదిలా ఉంటే.. తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు సమంత కొన్ని నెలల కిందట స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి సమంత ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రచారాలు అయితే ఆమె అభిమానులను సైతం ఆందోళనకు గురిచేశాయి. అయితే ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో తన ఆరోగ్య పరిస్థితిపై సమంత స్పందిస్తూ వస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర