మాదక ద్రవ్యాల కేసులో హీరో శ్రీరామ్‌ అరెస్ట్.. బ్లడ్‌ టెస్ట్ ల్లో నిర్థారణ.. కోలీవుడ్‌లో కలవరం

Published : Jun 23, 2025, 04:32 PM IST
hero sriram

సారాంశం

కోలీవుడ్‌ హీరో శ్రీరామ్‌( శ్రీకాంత్) అరెస్ట్ అయ్యారు. మాదక ద్రవ్యాల కేసులో ఆయన్ని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దీంతో ఇది కోలీవుడ్‌ కలకరం రేపుతోంది. 

మాదక ద్రవ్యాల వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనికి బానిసలు అవుతున్నారు. చాపకింద నీరులా ఇది అంతా వ్యాపిస్తుంది. గతంలోనూ టాలీవుడ్‌లో మాదక ద్రవ్యాల విషయం కలకలం రేపిన విషయం తెలిసిందే. 

ఈ కేసులో చాలా మంది సెలబ్రిటీలు విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరో హీరో మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నారు. తెలుగు, తమిళంలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్‌ మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయ్యారు. సోమవారం ఆయన్ని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

మాదక ద్రవ్యాల కేసులో నటుడు శ్రీరామ్‌ అరెస్ట్ 

శ్రీరామ్‌కి మాదక ద్రవ్యాల టెస్ట్ చేయగా, అందులో మాదక ద్రవ్యాల వాడినట్టు నిర్థారణ అయ్యింది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే ఐటీ విభాగంలో పనిచేసే ప్రశాంత్ అనే వ్యక్తిని ఒక బార్ లో జరిగిన గొడవ కేసులో అరెస్ట్ చేశారు. 

అతన్ని విచారించగా విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు తెప్పించి నటుడు శ్రీకాంత్ కి ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు. నుంగంబాక్కంలోని ఒక బార్ లో జరిగిన గొడవ కేసులో అరెస్ట్ అయిన ప్రశాంత్, శ్రీకాంత్ కి కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు ఇచ్చినట్టు పోలీసులకు చెప్పాడు.  

శ్రీకాంత్ కి రక్త పరీక్షలు, మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు నిర్థారణ

దీంతో శ్రీరామ్‌కి బ్లడ్‌ టెస్ట్ చేయగా, ఇందులో ఆయన మాదక ద్రవ్యాలు వాడినట్టు తేలింది. దీంతో శ్రీరామ్‌ని విచారించిన పోలీసులు తాజాగా అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ ఘటన కోలీవుడ్‌లో కలవరం సృష్టిస్తోంది. 

2002లో వచ్చిన ‘రోజా కూటం’ సినిమాతో శ్రీకాంత్ సినీ రంగ ప్రవేశం చేశాడు. తమిళం తో పాటు తెలుగు, మలయాళ సినిమాల్లో కూడా నటించాడు.  `వర్ణజాలం’, ‘కనా కాండెన్’, ‘ఒరునాళ్ కనవు’, ‘పంబరకణ్ణాలే’, ‘మెర్క్యురీ పూక్కళ్’, ‘కిళక్కు కడర్కరై సాలై’, ‘పూ’, ‘చతురంగం’  వంటి తమిళ చిత్రాల్లో నటించాడు. 

 ‘పార్తిబన్ కనవు’ సినిమా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకి తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అవార్డు కూడా వచ్చింది.

శ్రీరామ్‌ నటించిన తెలుగు సినిమాలివే 

ఇక శ్రీరామ్‌ తెలుగులో `ఒకరికి ఒకరు`, `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`, `పోలీస్‌ పోలీస్‌`, `దడ`, `నిప్పు`, `లై`, `రాగల 24 గంటల్లో`, `అసలేం జరిగింది`, `టెన్త్ క్లాస్‌ డైరీస్`, `రావణాసుర`, `పిండం`, `వళరి`, `ఎర్రచీర` వంటి చిత్రాల్లో నటించారు. 

తెలుగులో ఆయన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇతర హీరోలతో కలిసిన చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా `ఆడవారి మాటలకు అర్థాలు వేరులే`లో ఆయన పాత్ర తెలుగు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. హీరోగా మళ్లీ బిజీ అవుతున్న ఆయన ఇప్పుడు ఇలా మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ కావడం విచారకరం. 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్