ఊ.. అంటావా మావా అంటూ రెచ్చిపోయిన శివబాలాజీ భార్య, డాన్స్ తో రచ్చ రచ్చ చేసిన మధుమిత

Published : Feb 22, 2023, 07:07 AM ISTUpdated : Feb 22, 2023, 07:19 AM IST
ఊ.. అంటావా మావా అంటూ రెచ్చిపోయిన శివబాలాజీ భార్య, డాన్స్ తో రచ్చ రచ్చ చేసిన మధుమిత

సారాంశం

ఊ అంటావా మావా ఊహూ అంటావా అంటూ.. డాన్స్ పర్ఫామెన్స్ తో రెచ్చిపోయింది..యాక్టర్ శివబాలాజీ భార్య మధుమిత.

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది జంటలు ప్రేమించుకుని పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. అందులోకొంత మంది.. పెళ్ళైన కొంత కాలానే విడాకులతో విడిపోతుంటే.. మరికొంత మంది మాత్రం చిలకా గోరింకల్లా కాపురం చేసుకుంటూ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాంటి జంటల్లో శివబాలాజీ, మధుమిత కూడా ఒకరు. పెళ్లై దాదాపు 10ఏళ్లు పైనే అవుతున్నా ఏమాత్రం పొరపొచ్చాలు లేకుండా.. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈ జంట.ఒక రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకు ఆదర్శంగా జీవిస్తున్నారు. 

ఒకప్పుడు యాక్టరన్ గా ఫుల్ బిజీగా ఉన్న శివబాలాజీ, మధుమితలు మంచి ఫామ్ లో ఉండగానే ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నారు. ఈక్రమంలో ఈ ఇద్దరికి ప్రస్తుతం సరైన సినిమాలు లేవు. శివబాలాజీ అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ.. బిజినెస్ చూసుకుంటుంటుండగా..మధుమిత మాత్రం తన ఫ్యామిలీకే పరిమితం అయ్యింది. పిల్లలను చూసుకుంటూ ఉండిపోయింది. ఇక ఒకప్పుడు బిజీ  నటుడిగా ఉన్న శివబాలాజీ.. ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నుండి సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటున్నాడు. ఈ మధ్య టీవీ షో మిస్టర్ అండ్ మిసెస్ అనే రియాలిటీ షోలో జడ్జిగా సందడి చేస్తున్నాడు. కాగా.. శివబాలాజీ యాక్టీవ్ గా ఉన్నట్లుగా ఆయన భార్య మధుమిత సోషల్ మీడియాలో అరుదుగా పోస్టులు పెడుతుంటుంది.

ఇక శివబాలాజీ భార్య  మధుమిత ఇంటిని చూసుకుంటూనే.. ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తోంది. తన ఫ్యామిలీ సంగతులు కూడా పంచుకుంటూ రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది.  ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించినా శివబాలాజీతోనే కనిపిస్తుంది. తాజాగా పుష్ప సినిమాలో పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది మధుమిత.  ఐటెమ్ సాంగ్ ఊ అంటావా మావ.. ఉఊ అంటావా.. అనే పాటకు భర్తతో కలిసి అదిరిపోయే స్టెప్స్ వేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో మధుమిత డ్రెస్సింగ్ స్టైల్ కి.. ఆమె చేసిన హాట్ ఎక్స్ ప్రెసివ్ డాన్స్ కి ఫిదా అవుతున్నారు నెటిజన్స్.

 

అంతే కాదు మధుమితను ఇంతకుముందెన్నడు ఇలా చూడలేదు నెటిజన్లు. చాలా హాట్ గా కనిపించింది శివబాలాజీ వైఫ్.  ఈసారి ఇలా కిక్కిచ్చే డాన్స్ తో సర్ప్రైజ్ చేసిందని ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. మీలో ఈకోణం కూడా ఉందా అంటూ మరికోంత మంది కామెంట్లు పెడుతున్నారు. అయితే.. వీరితో పాటు ఆట సందీప్ కూడా ఆ వీడియోలో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?