ఎగ్జిట్ పోల్స్ పై హీరో సెటైరికల్ ట్వీట్!

Published : Dec 12, 2018, 08:29 AM IST
ఎగ్జిట్ పోల్స్ పై హీరో సెటైరికల్ ట్వీట్!

సారాంశం

దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఫలితాలను వెల్లడించారు. తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ తన హవా చూపించలేకపోయింది. కాంగ్రెస్ ముందు బీజేపీ ప్రభావం కనిపించలేదు. 

దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఫలితాలను వెల్లడించారు. తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ తన హవా చూపించలేకపోయింది. కాంగ్రెస్ ముందు బీజేపీ ప్రభావం కనిపించలేదు. అయితే ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందని కొన్ని మీడియా వర్గాలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చారు.

రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని అంచనా వేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారయ్యాయి. దీంతో హీరో సిద్ధార్థ్ ఎగ్జిట్ పోల్స్ పై సెటైర్ వేశాడు.

ఒక మీడియా సంస్థ అనౌన్స్ చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇక మీరు ఎగ్జిట్ అయితే బాగుంటుందంటూ కామెంట్ చేశాడు. సిద్ధార్థ్ ట్వీట్ కి ఏకీభవిస్తూ కొందరు నెటిజన్లు ఇకనైనా ఇలాంటి పద్దతికి దూరంగా ఉండాలని కామెంట్ చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో కొన్ని మీడియా వర్గాలు కావాలనే కొన్ని పార్టీలకు మద్దతుగా సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అటువంటి మీడియా సంస్థలను టార్గెట్ చేస్తూ సిద్ధార్థ్ ఈ రకంగా స్పందించాడు. 

 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి