అవును నా కూతురు ప్రేమలో ఉంది.. హీరోయిన్ తండ్రి కామెంట్స్!

Published : Dec 12, 2018, 07:48 AM IST
అవును నా కూతురు ప్రేమలో ఉంది.. హీరోయిన్ తండ్రి కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ లో రణబీర్ కపూర్, అలియా భట్ లు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. రణబీర్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. 

బాలీవుడ్ లో రణబీర్ కపూర్, అలియా భట్ లు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. రణబీర్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. కానీ ఇప్పటివరకు నేరుగా మీడియా ముందు మాట్లాడిన సందర్భాలు లేవు.

అలియా అయితే ఇప్పటివరకు తన ప్రేమ గురించి పెదవి విప్పలేదు. ఇద్దరూ కలిసే ఉంటున్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అలియా భట్ తండ్రి ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ తాజాగా కొన్ని కామెంట్స్ చేశారు.

''రణబీర్ అంటే నాకు ఇష్టం. గొప్ప వ్యక్తి. రణబీర్, అలియా లవ్ లో ఉన్నారని తెలుసుకోవడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదు. వారి రిలేషన్షిప్ సవ్యంగా సాగుతోంది. ఈ బంధాన్ని వాళ్లు పెళ్లి వరకూ తీసుకెళతారా..? లేదా..? అనేది చూడాలి.

నా అభిప్రాయం ప్రకారం వచ్చే ఏడాది వారి పెళ్లి జరిగే అవకాశం ఉంది. కానీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందే ఊహించి చెప్పలేం'' అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.  

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు