
చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది. కర్నాటకకు (karnataka) చెందిన యువ సినీ నటుడు సతీష్ వజ్ర (satish vajra) శనివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. బెంగళూరులోని తన స్వగృహంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. బావమరిదే హంతకుడని ప్రచారం జరుగుతోంది. వజ్ర భార్య 3 నెలల కిందట.. ఆత్మహత్య చేసుకుంది. దీంతో.. తన అక్క ఆత్మహత్యకు వజ్రనే కారణమని భావించి.. నిందితుడు దారుణానికి పాల్పడినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సతీష్ షార్ట్ ఫ్లిలిమ్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించి తద్వారా కొన్ని టీవీ సీరియల్స్‌లో అవకాశాలు అందుకున్నాడు. 'లగోరి' అనే కన్నడ చిత్రంలో సహాయక పాత్రను కూడా పోషించాడు. మాండ్యలోని మద్దూరుకు చెందిన సతీష్‌కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. సతీష్ వజ్ర.. మండ్య ప్రజ్వల్ దేవరాజ్ అభిమానుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. అలాగే ఒక పక్క సినిమా ప్రయత్నాలు చేస్తూనే మరోపక్క సెలూన్‌ను కూడా నడుపుతున్నాడు. అతని కస్టమర్లలో కొందరు సినీ నటులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సతీష్ బెంగళూరులోని బసవన్న గుడి సమీపంలోని పట్టనగెరెలో నివసిస్తున్నాడు.