విరాటపర్వం భారీ డిజిటల్ డీల్, ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే..?

Published : Jun 19, 2022, 05:53 PM IST
విరాటపర్వం భారీ డిజిటల్ డీల్, ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే..?

సారాంశం

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకుంది.. ఇక తాజాగా డిజిటల్ డీల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 


రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకుంది.. ఇక తాజాగా డిజిటల్ డీల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 

రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌లై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నీది నాది ఒకే క‌థ ఫేం వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి విశేష ఆధ‌ర‌ణ వ‌స్తుంది. రానా, సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌కు సినీప్ర‌ముఖులు సైతం మంత్ర ముగ్ధుల‌య్యారు.ముఖ్యంగా సాయి పల్లవి తన నటన ద్వారా అందరినీ మరోసారి ఫిదా చేసింది.జూన్ 17వ తేదీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం ఒమ్ము చేయకుండా.. హిట్ అయ్యింది.

1990లో జరిగిన యదార్థ సంఘటనకు ప్రేమను జోడించి మహా ప్రేమకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.ఇక ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా...  కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది.ఇలా పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా థియేటర్ లో కాకుండా డైరెక్టుగా డిజిటల్ స్క్రీన్ పై విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ..  విరాటపర్వం సినిమా థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ఇలా థియేటర్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా డిజిటల్ డీల్ గురించి సోషల్ మీడియా కోడై కూస్తోంది. 

విరాట పర్వం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా థియేటర్లో నాలుగు వారాలు పూర్తి చేసుకున్న తర్వాత డిజిటల్ స్క్రీన్ పై ప్రసారం కానున్నట్టు సమాచారం.  ఈమూవీ కోసం దాదాపు  15 కోట్లకు డిజిటల్ డీల్ కుదిరిందని ఫిల్మ్ నగర్ సమాచారం. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఒక అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమాను 50 రోజులు తరువాత ఓటీటీలో విడుదల చేయాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.  ఇక ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ తో పాటు ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?