దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో రూపుదిద్దుకోనున్న భారీ అడ్వెంచర్ ఫిల్మ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.
‘ఆర్ఆర్ఆర్’ను గ్లోబల్ సెన్సేషన్ గా మార్చిన టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) మహేశ్ బాబుతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి SSMB29 వర్క్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతున్నాయి. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ బలమైన కథను అందించబోతున్నారు. ఇప్పటికే రైటింగ్ టీమ్ పనిలో నిమగ్నమైంది. మరోవైపు ఆస్కార్ విన్నింగ్ తర్వాత అంతర్జాతీయ మీడియా వేదికల్లో రాజమౌళి ‘ఎస్ఎస్ఎంబీ29’పై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. ఇప్పటికే మహేశ్ ఓ ప్రపంచ సాహస యాత్రికుడిగా కనిపించబోతున్నారని, ఆఫ్రికా అడవుల్లో అడ్వెంచర్స్ ను చూపించబోతున్నారంటూ వార్తలు అందాయి. దీంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఇక తాజాగా మహేశ్ బాబు క్యారెక్టరైజేషన్ పై అదిరిపోయే అప్డేట్ అందింది. SSMB29లోని మహేష్ బాబు పాత్ర హనుమంతుని నుండి ప్రేరణ పొందారని ప్రచారం జరుగుతోంది. జక్కన్న సైతం రామాయణం, మహాభారతం నుంచి బలమైన క్యారెక్టర్లను ఇన్ స్పైర్ అయ్యేందుకు ఇష్టపడుతుంటారు.
ఈక్రమంలో బలశాలి అయిన హనుమంతుడి లక్షణాలు ఎస్ఎస్ఎంబీ29లోని మహేశ్ బాబు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో సినిమాలోని యాక్షన్ల సీక్వెన్స్ లపై అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీగా డెవలప్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏకంగా మూడు పార్టులుగా ‘ఎస్ఎస్ఎంబీ29’ రాబోతుందని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ లేదా జూలైలోనే చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. కుదరకపోతే ఏడాది చివర్లో మొదలు కానుందంటున్నారు.
SSMB29ను పాన్ వరల్డ్ చిత్రంగా రాబోతోంది. భారతీయ సినిమాలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటి రూపుదిద్దుకోనుంది. చిత్రం హక్కులను సోనీ పిక్చర్స్ లేదా డిస్నీ ప్లస్ బ్యాంక్రోల్ చేశాయని అంటున్నారు. భారీ నిర్మాణ సంస్థ చిత్రాన్ని నిర్మించబోతుంది. VFX వర్క్ మొత్తం లాస్ ఏంజిల్స్‌లో జరిగేలా చూస్తున్నారంట. బెస్ట్ అవుట్ పుల్ కోసం హాలీవుడ్ టెక్నీషన్స్ ను దర్శకధీరుడు లైన్ లో పెట్టారని చెబుతున్నారు.