ప్రముఖ నటుడు, పొలిటిషన్ రవికిషన్ కూతురిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నటుడి కూతురు డిఫెన్స్ లో జాయిన్ అయ్యి దేశభక్తిని చాటుకోవడంతో అభినందిస్తున్నారు.
‘రేసుగుర్రం’తో విలన్ గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నా నటుడు రవికిషన్ (Ravi Kishan). భోజ్ పూరి నటుడిగా తొలుత కేరీర్ ను ప్రారంభించాడు. 1992 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఎన్నో హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులోనూ విలన్ గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే తాజాగా రవికిషన్, ఆయన కూతురును నెటిజన్లు అభినందిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పథకంలో రవికిషన్ కూతురు ఇషితా (Ishita) డిఫెన్స్ లో జాయిన్ అయ్యారు. స్వయంగా రవికిషన్ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే, నటుడిగా మంచి సక్సెస్ లో ఉన్నప్పటికీ.. ఆర్మీలో జాయిన్ అయ్యి దేశసేవకు తనవంతు కృషి చేస్తుండటంతో ఆమెను ప్రశంసిస్తున్నారు. ఆమెను ప్రోత్సహించినందుకు రవి కిషన్ ను కూడా అభినందిస్తున్నారు.
రవికిషణ్ నటుడిగానే చాలా మందికి తెలుసు. సినిమాల్లోనే కాకుండా టీవీ ఆర్టిస్ట్ గానూ చాలా కాలం నటించారు. పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటించి మెప్పించారు. స్పైడర్ మ్యాన్ 3కి డబ్బింగ్ కూడా చెప్పారు. పలు చిత్రాలకు ప్రొడ్యూస్ కూడా చేశారు. ఇదిలా ఉంటే.. రవికిషన్ ప్రస్తుతం బీజీపీ నుంచి గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్నారు. ఇటు నటుడిగా కొనసాగుతూనే అటు పొలిటిషన్ గానూ ప్రజాసేవ చేస్తున్నారు. ఇక ఈ ఏడాదిగా రవికిషన్ ఎలాంటి సినిమాల్లో కనిపించలేదు.
ఇక ఆయన నటుడిగా కేరీర్ ప్రారంభించిన ఏడాది తర్వాత ప్రీతి శుక్లా ను పెళ్లి చేసుకున్నారు. 1993డిసెంబర్ 10న వీరి వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం. ఒక కొడుకు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు రివా కిషన్ ఇఫ్పటికే హిందీ చిత్రం ‘సబ్ కుషాల్ మంగళ్’ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.