మందకోడిగా సినీ తారల ఓటింగ్‌.. ఓట్‌ వినియోగించుకున్న నాగార్జున, తేజ, మంచు లక్ష్మీ

Published : Dec 01, 2020, 10:02 AM ISTUpdated : Dec 01, 2020, 10:42 AM IST
మందకోడిగా సినీ తారల ఓటింగ్‌.. ఓట్‌ వినియోగించుకున్న నాగార్జున, తేజ, మంచు లక్ష్మీ

సారాంశం

తాజాగా హీరో నాగార్జున తమ ఓట్‌ని వినియోగించుకున్నారు. అలాగే దర్శకుడు తేజ సైతం తమ ఓట్‌ని వినియోగించుకున్నారు. వీరితోపాటు నిర్మాత, నటి, హోస్ట్ మంచు లక్ష్మీ సైతం తమ ఓటింగ్‌ని వినియోగించుకున్నారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌లో సినీ సెలబ్రిటీలు కాస్త నెమ్మదిగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఓటింగ్‌ ప్రారంభమైన వెంటనే 7.30గంటలకు చిరంజీవి సతీసమేతంగా ఓట్‌ వేసుకున్నారు. ఆ తర్వాత నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, ఆయన సతీమణి ఫిల్మ్ నగర్ క్లబ్‌లో ఓట్‌ వేశారు. మరో నిర్మాత ఉషా ముల్పూరి సైతం తమ ఓట్‌ని వినియోగించుకున్నారు. 

తాజాగా హీరో నాగార్జున తమ ఓట్‌ని వినియోగించుకున్నారు. అలాగే దర్శకుడు తేజ సైతం తమ ఓట్‌ని వినియోగించుకున్నారు. వీరితోపాటు నిర్మాత, నటి, హోస్ట్ మంచు లక్ష్మీ సైతం తమ ఓటింగ్‌ని వినియోగించుకున్నారు. ఆమె తొమ్మిదిన్నర గంటల సమయంలో ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీ సెంటర్‌లో తమ ఓట్‌ని వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు తమ ఓట్‌ని వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. పోలింగ్‌ స్టార్ట్ అయిన మూడు గంటలైనా.. ఇంకా సెలబ్రిటీలు చురుకుగా  ఓటింగ్‌లో పాల్గొనకపోవడం విచారకరం.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

అలాంటి రోల్స్ ఎందుకు చేశానంటే..! సొంతవాళ్లే మోసం చేశారన్న నటి షకీలా..
బట్టలు ఎంత తగ్గిస్తే.. అన్ని లైక్స్, డబ్బులు, ఆఫర్లు.. మాధవీలత షాకింగ్ కామెంట్స్..