రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్... మహేష్, పవన్ లతో యుద్దానికి సిద్దమైన ప్రభాస్

Published : Jul 30, 2021, 09:45 AM IST
రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్... మహేష్, పవన్ లతో యుద్దానికి సిద్దమైన ప్రభాస్

సారాంశం

కొంచెం లేటైనా మంచి సీజన్ ని రాధే శ్యామ్ విడుదలకు ఎంచుకున్నారు రాధే శ్యామ్ టీమ్. 2022 జనవరి 14న మకర సంక్రాంతి నాడు విడుదల చేయనున్నట్లు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. సూటు బూటులో సూట్ కేసు పట్టుకొని స్టైలిష్ గా ఉన్న ప్రభాస్ లుక్ కేకపుట్టిస్తుంది.

ప్రభాస్ సంక్రాంతి సమరానికి సిద్ధమయ్యారు. ఆయన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలు తమ చిత్రాల విడుదల సంక్రాంతికి ప్రకటించిన నేపథ్యంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రభాస్-పూజా హెగ్డే జంటగా దర్శకుడు రాధా కృష్ణ రాధే శ్యామ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంటుంది. 


ఇటలీ నేపథ్యంలో జరిగే పీరియాడిక్ రొమాంటిక్ లవ్ డ్రామా రాధే శ్యామ్ తెరకెక్కుతుంది. రాదే శ్యామ్ జులై లో విడుదల చేయాలని మొదట భావించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దీనితో రాధే శ్యామ్ విడుదల మరింత ఆలస్యమైంది. ప్రభాస్ గత చిత్రం సాహో విడుదలై రెండేళ్లు కావస్తుండగా ఫ్యాన్స్ రాధే శ్యామ్ విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 


కొంచెం లేటైనా మంచి సీజన్ ని రాధే శ్యామ్ విడుదలకు ఎంచుకున్నారు రాధే శ్యామ్ టీమ్. 2022 జనవరి 14న మకర సంక్రాంతి నాడు విడుదల చేయనున్నట్లు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. సూటు బూటులో సూట్ కేసు పట్టుకొని స్టైలిష్ గా ఉన్న ప్రభాస్ లుక్ కేకపుట్టిస్తుంది. మరోవైపు మహేష్ సర్కారు వారి పాట, పవన్ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ సంక్రాంతి బరిలో ఉన్నాయి. దీనితో మహేష్, పవన్ లతో ప్రభాస్ సమరానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. 2022 సంక్రాంతి పోరు రసవత్తరంగా మారనుంది. 
 

PREV
click me!

Recommended Stories

Akira Nandan: నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? రేణు దేశాయ్‌ ఫోన్‌ చేస్తే పవన్‌ రియాక్షన్‌ ఇదే
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్, ఎమోషనల్ కామెంట్స్