నాని నెక్ట్స్ ప్రాజెక్టుపైనే దృష్టి పెడుతున్నారు. ఆ సినిమాకు భారీ బడ్జెట్ అంటే 200 కోట్లు దాకా పెడుతున్నట్లు వినికిడి.
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోద శనివారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఆ తర్వాత సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. అయితే నిర్మాత డివివి దానయ్య బడ్జెట్ లిమిటేషన్స్ కారణంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌ను టేకోవర్ చేయడానికి మరో ఇద్దరు నిర్మాతలు రేసులో ఉన్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం నాని ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నాడు. సుజీత్‌కి చాలా మంది నిర్మాతలకు కమిట్మెంట్లు ఉండటంతో నాని సినిమాకు సంబందించి పనులు సరిగ్గా జరగడం లేదు. అందువల్ల, కొత్త నిర్మాతను బోర్డులోకి తీసుకురాకుండా నాని ఈ చిత్రాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో నాని నెక్ట్స్ ప్రాజెక్టుపైనే దృష్టి పెడుతున్నారు. ఆ సినిమాకు భారీ బడ్జెట్ అంటే 200 కోట్లు దాకా పెడుతున్నట్లు వినికిడి. ఇంతకీ ఎవరా డైరక్టర్ అంటే...శ్రీకాంత్ ఓదెల.
దసరా సూపర్ సక్సెస్ తర్వాత మరో సినిమా కోసం దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో నేచురల్ స్టార్ నాని సినిమా చేయటానికి పూర్తిగా రంగం సిద్దమైంది. దసరా సెట్స్‌లో శ్రీకాంత్ తమ రెండవ ప్రాజెక్టు ప్లాట్‌ను వివరించాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. నాని కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో దాదాపు 200 కోట్లతో రూపొందుతున్న సినిమా కావడంతో నాని ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలను రోజూ పర్యవేక్షిస్తున్నాడు.
ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఈ ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని అంటున్నారు. నాని కొత్త లుక్‌లో కనపడనున్నారు. అలాగే నాని ఈ ప్రాజెక్ట్ కోసం బల్క్ డేట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రం స్క్రిప్ట్ కి దసరాకి పోలికలు లేవు . అలాగే దసరాకి సీక్వెల్ కూడా కాదు. ప్రస్తుతం సాంకేతిక నిపుణులను ఖరారు చేశారు.
ఇక మార్చి 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన దసరా (Dasara) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. సింగరేణి ప్రాంతంలోని వీర్లపల్లి గ్రామంలో జరిగే స్టోరీతో పక్కా తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా గ్రాస్ సాధించింది.
నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సరిపోదా శనివారం ఒకటి. షూటింగ్ దశలో ఉంది. మరోవైపు బలగం డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఎల్లమ్మ టైటిల్ ఫైనల్ చేశారు.