ప్రకాష్ రాజ్ నూ వదలని కులగజ్జి

Published : Mar 07, 2017, 01:42 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ప్రకాష్ రాజ్ నూ వదలని కులగజ్జి

సారాంశం

దక్షిణాది నటుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ప్రకాష్ రాజ్ ది తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ కన్నడిగుడైన ప్రకాశ్ రాజ్ ను కులం అడుగుతున్న తమిళ సినీ నిర్మాతలు

దక్షిణాది సినీ పరిశ్రమల్లోనే కాక బాలీవుడ్ లోనూ ప్రకాశ్ రాజ్ అంటే తెలియని వాళ్లుండరు. అంతా ప్రకాష్‌రాజ్‌ను తమవాడే అనుకుంటారు. దక్షిణాదికి చెందిన అన్ని భాషల్లోనూ అవలీలగా మాట్లాడే ప్రకాష్‌రాజ్‌ హిందీలో కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం తమిళనాడులో జరుగబోతున్న ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఎలక్షన్స్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడుతున్నాడు.

 

ప్రకాష్‌రాజ్‌ ఇప్పటివరకు దాదాపు 20 సినిమాలను నిర్మించాడు. అయితే నడిగర్‌ సంఘం ఎన్నికల సమయంలో తెలుగువాడంటూ విశాల్‌ వివక్షతను ఎదుర్కొన్నట్టే.. ప్రస్తుత ఎన్నికల్లో కన్నడిగుడంటూ ప్రకాష్‌రాజ్‌ స్థానికతను ప్రశ్నిస్తున్నారు. తన కులం గురించి, ప్రాంతం గురించి, భాష గురించి వారు ప్రశ్నిస్తున్నారంటూ ఈ అసమాన నటుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏదైమైనా వెనక్కి తగ్గేది లేదని, వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికై ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లోని అవినీతిని, నిర్లక్ష్యాన్ని రూపుమాపుతానని ప్రకాశ్ రాజ్ అంటున్నాడు.

PREV
click me!

Recommended Stories

Peddi Movie: పెద్దికి హిట్ టాక్ వస్తే ముందు లేచిపోయే రికార్డ్ ఏది.. పుష్ప 2 ? ధురంధర్ 2?
Motivational Song : మీ జీవితాన్నే మార్చేసే గొప్ప సాంగ్.. ఒక్కసారి వింటే IAS, IPS కావాలన్నంత కసి పెరగడం ఖాయం..!