నటి పవిత్ర లోకేష్‌ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న నరేష్‌.. ?

Published : Jun 20, 2022, 10:38 PM ISTUpdated : Jun 20, 2022, 10:44 PM IST
నటి పవిత్ర లోకేష్‌ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న నరేష్‌.. ?

సారాంశం

సీనియర్‌ నటుడు నరేష్‌.. నటి పవిత్ర లోకేష్‌ సహజీవనం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. 

సీనియర్‌ నటుడు నరేష్‌ మూడో వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉన్న ఆయన ఎట్టకేలకు వివాహం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా తెలుగు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్‌,నరేష్‌ కలిసి సహజీవనం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్టు వార్తలొచ్చాయి. ఇటీవల ఇద్దరూ కలిసి మహాబలేశ్వరం కి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో రూమర్స్ ఊపందుకున్నాయి. మ్యారేజ్‌కి రెడీ అవుతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. 

ఇదిలా ఉంటే తాజాగా ఏకంగా ఈ ఇద్దరు రహస్య వివాహం చేసుకున్నట్టు మరో వార్త ఊపందుకుంది. గత రెండు రోజులుగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవిత్ర లోకేష్‌ని నరేష్‌ మ్యారేజ్‌ చేసుకున్నారనేది నిజమే అని తెలుస్తుంది. అయితే ఎక్కడ చేసుకున్నాడు, ఎప్పుడు చేసుకున్నాడనేది క్లారిటీ లేదు. దీన్ని పూర్తిగా రహస్యంగా ఉంచాలని భావిస్తున్నట్టు టాక్‌. బయటకు రివీల్‌ చేయోద్దని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.

అయితే దీనిపై నరేష్‌ వ్యక్తిగత పీఆర్‌ టీమ్‌ స్పందించింది. ఇందులో నిజం లేదని చెప్పింది. ఇది ఫేక్‌ న్యూస్‌ అంటూ ఖండిస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా గత కొన్ని రోజులుగా నరేష్‌-పవిత్ర లోకేష్‌ల వివాహం వార్తలు నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. నరేష్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కీలక పాత్రలకు ఆయన బెస్ట్ ఆప్షన్‌ అవుతున్నాయి. అద్భుతమైన నటనతో మెప్పిస్తున్నారు. ఇటీవల నరేష్‌ నానితో కలిసి `అంటే సుందరానికి` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.  ఇందులో పవిత్ర కూడా నటించారు.

ఇదిలా ఉంటే నరేష్‌ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొన్ని మనస్పర్థాలతో ఇద్దరి నుంచి విడిపోయారు. మరోవైపు పవిత్ర లోకేష్‌ సైతం 2007లో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సుచేంద్ర ప్రసాద్‌ను వివాహం చేసుకుంది. కానీ భర్తతో మనస్పర్థల కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. కాకపోతే ఇంకా ఆమెకు చట్టబద్ధంగా విడాకులు రాలేదు. కోర్ట్ త్వరలో విడాకులు మంజూరు అవ్వగానే వీరు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని టాక్‌ వినిపించింది. మరోవైపు పవిత్ర లోకేష్‌ తెలుగులో నరేష్‌ నటించిన ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంటుంది. ఆమెకి అవకాశాల విషయంలో నరేష్‌ సపోర్ట్ చేస్తుంటాడని భోగట్టా. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్