
మెగా మేకర్, దర్శకుడు ఎంఎస్ రాజు తాజాగా రూపొందించిన చిత్రం ‘7డేస్ 6 నైట్స్’. ఈ మూవీ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమైంది. అయితే పక్కా ప్లానింగ్ తో నిర్మాత చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా '7 డేస్ 6 నైట్స్'. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా.. మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లు గా నటించారు. 'డర్టీ హరి'తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఎంఎస్ రాజు, ఆ తర్వాత దర్శకత్వం వహించిన చిత్రమిది. జూన్ 24న విడుదల అవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది.
ఇప్పటికే తెలుగులో పెద్ద చిత్రాలు ‘పుష్ఫ, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారిపాట’ చిత్రాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో ప్రభుత్వాలు వీటి టికెట్ రేట్స్ ను హైక్ చేస్తూ పర్మిషన్ ఇచ్చాయి. ఆ సమయంలో ఆడియెన్స్ కూడా థియేటర్లకు రావడానికి కాస్తా ఇబ్బంది పడ్డారు. అయినా బడా హీరోలను తెరమీద చూడాలనే ఆశ వారిని థియేటర్ దాకా తీసుకొచ్చింది. తప్పని పరిస్థితుల్లో వందలు పోసి టికెట్లు కొన్నారు.
కానీ ప్రస్తుతం చిన్న సినిమాలకు ఆ పరిస్థితి లేదు. జనం థియేటర్‌కి రావడం లేదు. ఎక్కువ టికెట్ రేట్లు ఉండటంతో రావడానికి ఆసక్తి చూపడం లేదు. పెరిగిన టికెట్ రేట్ల ప్రభావంతో జనం థియేటర్‌కి దూరమవుతున్న నేపథ్యంలో ఎంఎస్ రాజు ముందు జాగ్రత్త పడ్డాడు. ముందే తేరుకుని టికెట్ల రేట్ల విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన మాట్లాడారు.... ‘జూన్ 24న మా '7 డేస్ 6 నైట్స్' విడుదల చేస్తున్నాం. ఈ రోజు కొత్త ట్రైలర్ విడుదల చేశాం. ఇది యూత్‌ఫుల్ ట్రైలర్. లో బడ్జెట్ సినిమాగా తోసేయాలని అనుకోలేదు. చివరి క్షణం వరకు ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలని ట్రై చేశాం.
థియేటర్ల దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలుసు. చిన్న సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూపించాలని అనుకుంటున్నాం. '7 డేస్ 6 నైట్స్' అనే బాంబు తీసుకొస్తున్నాం. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాలో ఎంత తక్కువ టికెట్ రేట్ ఉంటే అంతకు అమ్మమని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పాను. ప్రేక్షకులపై ధర భారం పడకుండా చూస్తున్నాం.ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మా అబ్బాయి, అమ్మాయికి ఆల్ ది బెస్ట్.