లైసెన్స్డ్ రివాల్వర్ కోరిన నటుడు నరేష్ 

Published : Jul 06, 2023, 08:02 PM ISTUpdated : Jul 06, 2023, 08:09 PM IST
లైసెన్స్డ్ రివాల్వర్ కోరిన నటుడు నరేష్ 

సారాంశం

నటుడు నరేష్   తుపాకీకి లైసెన్స్ కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. స్వీయ రక్షణ కోసం ఆయుధం కావాలని వివరణ ఇచ్చారు.   

స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ పుట్టపర్తి ఎస్పీ మాధవరెడ్డిని కలిశారు. ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్సు ఇవ్వాలని కోరారు. నరేష్ తుపాకీ లైసెన్స్ కావాలని అప్లై చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నరేష్ కి మూడో భార్య రమ్య రఘుపతితో విడాకుల విషయంలో వివాదం నెలకొంది. విడాకులు కావాలని ఆయన, వద్దని ఆమె కోర్టులో వాదులాడుతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నరేష్ ఉమనైజర్, నీలి చిత్రాలు చూస్తాడంటూ రమ్య ధ్వజమెత్తారు. 

నరేష్ కూడా ప్రత్యారోపణలు చేశారు. నా ఫోన్ ట్యాప్ చేసింది. బ్లాక్ మెయిలింగ్ మెటీరియల్ తయారు చేసింది. చంపించేందుకు రెక్కీ నిర్వహించింది. ఆమెకు డబ్బు పిచ్చి, అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ నరేష్ మండిపడ్డారు. నరేష్, రమ్య రఘుపతి, పవిత్ర లోకేష్ జీవితాల ఆధారంగా మళ్ళీ పెళ్లి టైటిల్ తో మూవీ తీసిన నరేష్... రమ్య రఘుపతి పాత్రను నీచంగా చూపించాడు. ఆ మూవీ విడుదల ఆపేయాలని రమ్య కోర్టును ఆశ్రయించారు. సాధ్యం కాలేదు. 

ఓటీటీ ప్రసారాలు నిలిపివేయాలని రమ్య మరోసారి కోర్టులో పిటిషన్ వేశారు. రమ్య రఘుపతితో వివాదాలు నడుస్తుండగా నరేష్ తుపాకీ లైసెన్సు కోరడం చర్చకు దారి తీసింది. ప్రముఖులు, సెలెబ్రిటీలకు ఆత్మరక్షణ కోసం ప్రభుత్వాలు లైసెన్ద్ గన్స్ కి అనుమతి ఇస్తాయి. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?