
మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచాడు. ఏమాత్రం టైమ్ వేస్ట్ చేయకుండా.. వరుసగాసినిమాలు ప్లాన్ చేసుకోవడమే కాకుండా.. ఆ మూవీస్ ను త్వరగా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా భోళా శంకర్. తమన్నా మెగాస్టార్ జోడీగా నటిస్తున్న ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కాగా భోళా శంకర్ సినిమాకు సబంధించిన పనులను మెగాస్టార్ చిరంజీవి స్పీడప్ చేశారు. ఏదోఒక అప్ డేట్ ప్లాన్ చేస్తూ.. ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపేప్రయత్నంచేస్తున్నారు.
తాజాగా ఈసినిమాకు సబంధించి అప్ డేట్ అందించారు మెగాస్టార్ చిరంజీవి. భోళా శంకర్ డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సినిమా రూపుదిద్దుకున్న విధానం చాలా సంతృప్తి కలిగించిందని వెల్లడించారు. ఈ సినిమా మాస్ విశ్వరూపం ప్రదర్శించడం ఖాయమని, ఆడియన్స్ ను కచ్చితంగా అలరిస్తుందని చిరంజీవి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని, రిలీజ్ డేట్ ను సేవ్ చేసుకోవాలని.. ఇక థియేటర్లలో కలుసుకుందాం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అంతే కాదు మెగా ప్యాన్స్ ఈ ట్వట్ ను వైరల్ చేస్తున్నారు. భోళా శంకర్' సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చిరంజీవి చెల్లెలి పాత్రను కీర్తి సురేశ్ నటిస్తుండగా.. కీర్తి సురేష్ ను జంట పాత్రను అక్కినేని హీరో సుశాంత్ పోషిస్తున్నారు. అంతే కాదు ఈసినిమాలో సుశాంత్ పాత్ర కీలకం అని తెలుస్తోంది. వీరితో పాటు . రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మి గౌతమ్, ఉత్తేజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర 'భోళా శంకర్' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మాస్ మెగా ఎంటర్టయినర్ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.