సినీ నటుడు నరేష్ - పవిత్రా లోకేష్ తాజాగా పెళ్లిపీటలు ఎక్కినట్టు తెలుస్తోంది. అతికొద్ది మంది సన్నిహితుల మధ్య మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను నరేష్ స్వయంగా అభిమానులతో పంచుకోవడంతో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ నటుడు నరేష్ (Naresh) - పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) తాజాగా పెళ్లి పీటలు ఎక్కారు. కొద్దికాలంగా కలిసి ఉన్న వీరిద్దరూ న్యూఈయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా త్వరలో తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వీడియో షేర్ చేస్తూ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అతికొద్ది మంది సన్నిహితుల మధ్య పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నరేష్ పెళ్లివీడియోను పంచుకుంటూ అందరీ ఆశీస్సులు కోరారు.
నరేష్ స్వయంగా ట్వీటర్ ద్వారా పెళ్లికి సంబంధించిన వీడియోను పంచుకుంటూ అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులు, సపోర్ట్ కోరారు. వీడియోలో పెళ్లి దుస్తుల్లో మెరిసిన నరేష్, పవిత్రా పూజారి మంత్రోచ్ఛరణ మధ్య పవిత్రబంధంలో అడుగుపెట్టారు. ఈ సందర్బంగా నరేష్.. ‘మా ఈ కొత్త ప్రయాణంలో జీవితకాలం శాంతి & ఆనందం కోసం మీ దీవెనలు కోరుతున్నాను.. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడు అడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్రాలోకేష్’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.
గతంలో ఇచ్చిన అనౌన్స్ మెంట్ తప్పా పెళ్లికి సంబంధించిన అప్డేట్ రాలేదు. తాజాగా తక్కువ మంది సమక్షంలో పెళ్లిపీటలు ఎక్కారు. నెటిజన్లు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతేడాది నరేష్ తన మూడో భార్య రమ్యరఘుపతికి మధ్య వివాదాలు వచ్చి విడిపోయిన విషయం తెలిసిందే. అంతకముందే నరేష్ పవిత్రా ఇద్దరు కలిసిపోవడం.. కొద్దిరోజులు సహజీవనం కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఇద్దరు ఒక్కటవడం పట్ల అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. కానీ.. నరేష్ పెళ్లి విషయంలో వాస్తవం లేదంటున్నారు. కేవలం తను నటించిన ఓ చిత్రంలోని భాగమేనని ప్రచారం జరుగుతోంది. నరేష్ తాజాగా నటించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. ఈ సినిమా ప్రెస్ మీట్ కూడా ఇవ్వాళే జరిగింది. దీనికి నరేష్ కూడా హాజరయ్యారు. పెళ్లి వీడియోపై ప్రశ్నలు ఎదురవగా.. దాటవేసే ప్రయత్నమే చేశారు. అవును అని చెప్పలేకపోవడంతో అందరూ సందేహిస్తున్నారు.. చూడాలీ మరీ దీనిపై మున్ముందు నరేష్ ఇంకేదైనా క్లారిటీ ఇస్తారోనన్నది.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏
మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
- మీ ❤️ pic.twitter.com/f26dgXXl6g