కీరవాణి కొడుకుతో మురళీ మోహన్ మనవరాలు పెళ్లి... ముహూర్తం ఫిక్స్!

Published : Dec 13, 2023, 01:40 PM IST
కీరవాణి కొడుకుతో మురళీ మోహన్ మనవరాలు పెళ్లి... ముహూర్తం ఫిక్స్!

సారాంశం

నటుడు మురళీ మోహన్ తన ఇంట్లో జరగనున్న పెళ్లి వేడుకల గురించి కామెంట్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంటికి తన మనవరాలు కోడలిగా వెళుతుందని క్లారిటీ ఇచ్చాడు.   

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి నటుడు మురళీ మోహన్ బంధువులు కాబోతున్నారు. ఈ రెండు కుటుంబాలు వియ్యమాడనున్నాయి వార్తలు వచ్చాయి. ఈ కథనాలపై మురళీ మోహన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. నా మనవరాలు కీరవాణి ఇంటి కోడలు కాబోతున్న మాట వాస్తవమే అన్నారు. ఆయన మాట్లాడుతూ... నాకు కొడుకు, కూతురు ఉన్నారు. అమ్మాయి విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఆమెకు ఒక కూతురు ఉంది. 2024 ఫిబ్రవరిలో కూతురు బిడ్డ వివాహం ఉంది. 

అలాగే కొడుకుకు కూడా ఒక కుమార్తె ఉంది. ఆమెకు కూడా పెళ్లి కుదిరింది. కీరవాణి చిన్న కుమారుడు సింహ కోడూరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. వచ్చే ఏడాది చివర్లో ఈ వివాహం జరుగుతుంది, అని చెప్పారు. మురళి మోహన్ కొడుకు పేరు రామ్ మోహన్ రావు. ఈయన ఏకైక కుమార్తె పేరు రాగ అని సమాచారం. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో రాగ మాస్టర్స్ పూర్తి చేశారట. 

ఇక సింహ కోడూరి హీరోగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా యమదొంగ, మర్యాద రామన్న చిత్రాల్లో నటించిన సింహ కోడూరి మత్తు వదలరా మూవీతో హీరోగా మారాడు. ఆ మూవీ ఒకింత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాడు. ఆయనకు బ్రేక్ రాలేదు. 

మరోవైపు కీరవాణి ఈ ఏడాది ఆస్కార్, నేషనల్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. కీరవాణి భార్య శ్రీవల్లి కాస్ట్యూమ్ డిజైనర్. పెద్ద కొడుకు భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు. ఆస్కార్ వేదిక మీద 'నాటు నాటు' సాంగ్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు ఆలపించారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి సింహకు బాబాయ్ అవుతాడు. 

దూరం పెట్టిందని అనసూయ గురించి బ్యాడ్ గా చెబుతుంది ఎవరు? ఆమె అర్థం అదేనా!

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ