'గుంటూరు కారం'లో పొలిటికల్ టచ్​ , లీకైన ఫొటో చూశారా?

Published : Jul 19, 2023, 01:55 PM IST
  'గుంటూరు కారం'లో పొలిటికల్ టచ్​ , లీకైన ఫొటో చూశారా?

సారాంశం

మహేశ్‌ బాబు -త్రివిక్రమ్‌ కాంబోలో హ్యాట్రిక్‌ చిత్రంగా గుంటూరు కారం చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి లేటెస్ట్ లీక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

 
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్​ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్​ చిత్రం  'గుంటూరు కారం'. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి షూటింగ్​ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటూ ఈ మధ్యనే ఊపందుకుంది.  పక్కా మాస్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా రానున్న ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటికే మహేశ్​ పాత్రకు సంబంధించిన లుక్​ కూడా రిలీజై వైరల్ అయ్యింది. తాజాగా ఈ సినిమా గురించిన లీక్ బయిటకు వచ్చింది. అదేమిటంటే..ఈ సినిమాలో  పొలిటికల్​ నేపథ్యం  కూడా ఉంటుంది. ఆ విషయాన్ని నిజం చేస్తూ తాజాగా ఓ పోస్టర్ లీక్ అయ్యింది. 

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫొటోలో సీనియర్​ నటుడు ప్రకాశ్​ రాజ్​ రాజకీయ నాయకుడిగా  ఓ ఫ్లెక్సీ కనపడుతోంది. ఇది గుంటూరు కారం సినిమాలోని పోస్టర్​ అని చెబుతున్నారు. ఈ ఫ్లెక్సీలో 'ప్రజాబంధు జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వైర వెంకట స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనదళం పార్టీ యువజన నాయకులు నిజమాబాద్ జిల్లా' అని అందులో రాసి ఉంది. అంటే ప్రకాశ్​ రాజ్​.. శ్రీ వైర వెంకట స్వామి అనే రాజకీయ నేతగా కనిపిస్తారని తెలుస్తోంది.

  ఈ సినిమాకు ​ 'గంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్ర కథ మొత్తం.. గుంటూరు చుట్టు పక్కల సాగుతుందని అంతా  భావించారు. కానీ ప్రస్తుత పోస్టర్​లో నిజమాబాద్​ జిల్లా అని రాయడాన్ని చూసి ఆలోచనలో పడుతున్నారు. ఈ చిత్రంలో రెండు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్​ బ్యాక్​డ్రాప్ కాస్త లైట్​గా టచ్​ చేస్తారని అనుకుంటున్నారు. ​

గుర్తుందో లేదో మొదట్లో ఈ సినిమాకు  'అమరావతికి అటు ఇటు' అనే టైటిల్ అయితే తెగ ట్రెండ్ అయింది. ఇక ఇదే సమయంలో ఏపీ పాలిటిక్స్​లో రాజధాని విషయమై అమరావతి పేరు.. ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అందుకే ఈ పేరు​ వల్ల ఎటువంటి వివాదాలు తలెత్తకూడదని .. దాన్ని పక్కనపెట్టి 'గుంటూరు కారం' టైటిల్​ను ఫిక్స్​ చేసింది మూవీటీమ్ అని చెప్పుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు
2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?