ప్రముఖ సినీ, టీవీ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం..

Published : Feb 16, 2022, 03:38 PM IST
ప్రముఖ సినీ,  టీవీ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం..

సారాంశం

ప్రముఖ సినిమా, టీవీ నటుడు మహర్షి రాఘవం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి గోగినేని కమలమ్మ(84) కన్నుమూశారు. 

ప్రముఖ టాలీవుడ్‌ నటుడి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సినీ, టీవీ నటుడిగా రాణిస్తున్న `మహర్షి` రాఘవ తల్లి కన్నుమూశారు. వయసు, అనారోగ్యం రీత్యా `మహర్షి` రాఘవ తల్లి గోగినేని కమలమ్మ(84) బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో మహర్షి రాఘవ ఫ్యామిలీ కన్నీరుమున్నీరవుతుంది. 

గోగినేని కమలమ్మకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాఘవ సినీ, టీవీ ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నారు. రెండో కుమారుడు వెంకట్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు.  రాఘవ తల్లి మరణించిందనే వార్త తెలిసి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. రాఘవ ఫ్యామిలీకి సానుభూతిని ప్రకటిస్తున్నారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నారు. రాఘవ తల్లి కమలమ్మ అంత్యక్రియలు గురువారం జూబ్లీ హిల్స్‌ లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 

ఇదిలా ఉంటే దర్శకుడు వంశీ రూపొందించిన `మహర్షి` చిత్రంలో కథానాయకుడిగా నటించి ఆ సినిమాని తన ఇంటిపేరుగా చేసుకున్నారు రాఘవ. దాదాపు 170కిపైగా చిత్రాల్లో నటుడిగా నటించి ఆకట్టుకున్నారు. చాలా సినిమాల్లో హీరో పాత్రలు పోషించి వెండితెరపై అలరించింది. ఆయన నటించిన చిత్రాల్లో `మహర్షి` తోపాటు `చిత్రం భళారే విచిత్రం`, `జంబలకిడిపంబ`, `కోరుకున్న ప్రియుడు`, `శుభాకాంక్షలు`, `సూర్యవంశం` , `చంటి`, `మాతృదేవోభవ`, `నెంబర్‌ 1`, `పోకిరి రాజా`, `దేవుడు`, `శీను`, `నిన్ను చూడాలని` వంటి సినిమాలు ప్రధానంగా ఉన్నాయి. 

సినిమాల్లోనే కాదు, టీవీ రంగంలో ఆయన మరింతగా రాణించారు. సినిమాల్లో కంటే టీవీ రంగంలోనే బాగా పేరుతెచ్చుకున్నారు. సీరియల్స్ లో లీడ్‌ రోల్స్ ప్లే చేసి ఇంటి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు మహర్షి రాఘవ. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

దళపతి విజయ్ ప్లేస్ పై కన్నేసిన అల్లు అర్జున్ ? ఐకాన్ స్టార్ మాస్టర్ ప్లాన్ మూమూలుగా లేదుగా?
Naga Chaitanya: నాగ చైతన్యతో నటించి కనిపించకుండా పోయిన ఆరుగురు హీరోయిన్లు.. డేంజర్ లో మరో ముగ్గురి కెరీర్