95th Oscars: 'అమ్మా నేను ఆస్కార్ గెలిచాను'... ప్రపంచాన్ని ఆకర్షించిన విన్నింగ్ మూమెంట్!

Published : Mar 13, 2023, 07:18 AM ISTUpdated : Mar 13, 2023, 07:26 AM IST
95th Oscars: 'అమ్మా నేను ఆస్కార్ గెలిచాను'... ప్రపంచాన్ని ఆకర్షించిన విన్నింగ్ మూమెంట్!

సారాంశం

బెస్ట్ సపోర్టింగ్ కేటగిరీలో అమెరికన్ యాక్టర్ అండ్ ఫిలిం మేకర్ కే హుయ్ క్వాన్ ఆస్కార్ అందుకున్నారు. ఆయన విన్నింగ్ స్పీచ్ వైరల్ అవుతుంది.   

లాస్ ఏంజెల్స్ వేదికగా ప్రపంచ సినిమా పండగ ఆస్కార్ ఘనంగా జరుగుతుంది. అతిథి మహారథుల నడుమ 95వ ఆస్కార్ అవార్డ్స్ విన్నర్స్ ని ప్రకటిస్తున్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో కే హుయ్ క్వాన్ ఆస్కార్ అందుకున్నారు. ఎవరీ వేర్ ఎవరీ థింగ్ యట్ ఒన్స్ చిత్రంలోని నటనకు గాను ఆయనను ఆస్కార్ వరించింది. ది బాన్‌షీస్ ఆఫ్ ఇనిషెరిన్‌ చిత్రం నుండి బ్రెండన్ గ్లీసన్, కాజ్‌వే చిత్రం నుండి బ్రియాన్ టైరీ హెన్రీ, ది ఫాబెల్‌మాన్స్‌ నుండి జుడ్ హిర్ష్, ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్‌ చిత్రానికి గానూ  బారీ కియోఘన్ ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచారు. 

గట్టి పోటీ మధ్య కే హుయ్ క్వాన్... ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. ఆయన విన్నింగ్ మూమెంట్, స్పీచ్ వైరల్ అవుతుంది. అవార్డు అందుకున్న కే హుయ్ క్వాన్ 'అమ్మా నేను ఆస్కార్ గెలిచాను' అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన ఎమోషనల్ స్పీచ్ ఆస్కార్ వేడుకలో పాల్గొన్న చిత్ర ప్రముఖులు, ప్రపంచ సినిమా లవర్స్ ని ఆకర్షించింది. 
 

ఎవరీ వేర్ ఎవరీ థింగ్ ఆల్ యట్ ఒన్స్ చిత్రానికి డానియల్ క్వాన్ దర్శకుడు. కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. కే హుయ్ కెరీర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైంది. వియత్నాంలో పుట్టిన కే హుయ్ క్వాన్ 1984లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టారు. బ్లాక్ బస్టర్ మూవీ ఇండియన్ జోన్స్ అండ్ టెంపుల్ డోన్స్ ఆయన మొదటి చిత్రం. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..