Oscar 2023: ఆస్కార్‌ తొలి నిరాశ.. డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో `ఆల్‌ దట్‌ బ్రీత్స్` కి అవార్డు మిస్‌

Published : Mar 13, 2023, 06:42 AM ISTUpdated : Mar 13, 2023, 06:45 AM IST
Oscar 2023: ఆస్కార్‌ తొలి నిరాశ.. డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో `ఆల్‌ దట్‌ బ్రీత్స్` కి అవార్డు మిస్‌

సారాంశం

ఆస్కార్ అవార్డులో తొలి నిరాశ ఎదురయ్యింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ విభాగంలో నామినేట్‌ అయిన `ఆల్‌ దట్ బ్రీత్స్` చిత్రానికి అవార్డు దక్కలేదు. 

ప్రపంచంలోని అత్యున్నత పురస్కారం ఆస్కార్‌ వేడుక గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం(సోమవారం మార్నింగ్‌-ఇండియా టైమ్‌) లాస్‌ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక జరుగుతుంది. ఇందులో మన ఇండియన్‌( మన తెలుగు) తారలు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితోపాటు కీరవాణి, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాళభైరవ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. రామ్‌చరణ్‌తోపాటు ఆయన భార్య ఉపాసన కూడా ఆస్కార్‌ వేడుకలో సందడి చేయడం విశేషం. 

మన తెలుగు సినిమా `ఆర్‌ఆర్‌ఆర్‌` ఆస్కార్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. `నాటు నాటు` పాటకిగానూ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యింది. దీంతోపాటు బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో `ది ఎలిఫెంట్‌ విస్పరర్స్`, అలాగే డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ విభాగంలో `ఆల్‌ దట్‌ బ్రీత్స్` చిత్రాలు ఆస్కార్‌ నామినేషన్లని సాధించాయి. 

ఇదిలా ఉంటే ఆస్కార్‌లో మన ఇండియాకి ఈ ఏడాది మొదటి నిరాశ ఎదురయ్యింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ లో నామినేట్‌ అయిన ఆల్‌ దట్‌ బ్రీత్స్` కి అవార్డు దక్కలేదు. ఆ స్థానంలో అమెరికాకి చెందిన `నావల్నీ` డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ కి అవార్డు దక్కింది. ఈ చిత్రానికి డానియల్‌ రోహెర్‌ దర్శకత్వం వహించగా, ఇది రష్యా అపోజిషన్‌ లీడర్‌ అలెక్సీ నావల్నీ చుట్టూ తిరుగుతుంది. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ విభాగంలో నామినేట్‌ అయిన `ఆల్‌ దట్‌ బ్రీత్స్` చిత్రానికి షానక్‌ సేన్‌ దర్శకత్వం వహించారు. ఇద్దరు అన్నదమ్ముల కథని తెలియజేసే చిత్రమిది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి