తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు.. మెరుగైన వైద్యం అందుతోంది: జూనియర్ ఎన్టీఆర్

Published : Jan 29, 2023, 12:50 PM IST
తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు.. మెరుగైన వైద్యం అందుతోంది: జూనియర్ ఎన్టీఆర్

సారాంశం

ప్రముఖ సినీ నటుడు తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుందని ఆయన సోదరుడు, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఆయన  కూడా పోరాడుతున్నారని చెప్పారు. 

ప్రముఖ సినీ నటుడు తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుందని ఆయన సోదరుడు, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఆయన  కూడా పోరాడుతున్నారని చెప్పారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నను ఆదివారం జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లు  పరామర్శించారు. వారితో పాటు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కూడా ఆస్పత్రికి చేరుకుని తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. 27వ తేదీన దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకుందని అన్నారు. తన అన్న తారకరత్నకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఆయనకు అభిమానుల ఆశీర్వాదం, తాత ఆశీర్వాదం ఉందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. అందరూ ప్రార్థనలు కొనసాగించాలని, అభిమానుల ఆశీర్వాదం ఎంతో ముఖ్యమని చెప్పారు. 

కర్ణాటక హెల్త్ మినిస్టర్, తనకు ఆప్తులైన సుధాకర్‌‌కు ధన్యవాదాలు చెబుతున్నట్టుగా తెలిపారు. ఆయన కూడా ఈ పరిస్థితుల్లో తన వంతు  సాయం అందిస్తున్నారని చెప్పారు. తాను తారకరత్నను చూశానని.. ఆయన స్పందిస్తున్నారని.. మంచి వైద్యం అందుతుందని తెలిపారు. మరో ఇద్దరు వైద్యులను కూడా ఇక్కడికి రప్పించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ఆయన నిలకడగా ఉన్నారు.. అలాగానీ క్రిటికల్ కండీషన్ నుంచి బయటకు వచ్చినట్టుగా కాదన్నారు. అయితే చికిత్సకు స్పందిస్తున్నారని.. ఇది మంచి పరిణామని తెలిపారు. ఎక్మో సాయంలో తారకరత్న లేరని అన్నారు. కుటుంబ సభ్యునిగా తాను ఇక్కడకు వచ్చానని తెలిపారు. డాక్టర్లు తనకు ధైర్యం ఇచ్చారని.. అదే ధైర్యాన్ని తాను అభిమానులకు చెబుతున్నానని  అన్నారు. 

Also Read: తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. కొంతవరకు స్పందిస్తున్నారు: బాలకృష్ణ

నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. అందరి అభిమానంతో.. తమ్ముడు తారకరత్న తొందరగా కోలుకుని మన అందరి ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?