నడిరోడ్డుపై ప్రముఖ నటుడుతో వివాదం, కారు ధ్వంసం

By Surya PrakashFirst Published Nov 2, 2021, 7:50 AM IST
Highlights

రెండు గంటల పాటు ఇరుక్కున్నారు. దీంతో సహనం కోల్పోయిన ఆయన కారు దిగి కాంగ్రెస్‌ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. సాధారణ పౌరులకు కష్టాలు తెచ్చిపెట్టే విధంగా నిరసనలు తెలపడం తగదని వారించారు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. జోజు కారు అద్దాన్ని పగలగొట్టారు. 
 

పెరుగుతున్న పెట్రోలు, డీజల్ ధరలకు వ్యతిరేకంగా కేరళలోని ఎర్నాకుళంలో  కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దాంతో ఆ ప్రాంతంలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్దంబించి పోయింది. ఆ ట్రాఫిక్ లో నటుడు జోజు జార్జ్‌..   రెండు గంటల పాటు ఇరుక్కున్నారు. దీంతో సహనం కోల్పోయిన ఆయన కారు దిగి కాంగ్రెస్‌ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. సాధారణ పౌరులకు కష్టాలు తెచ్చిపెట్టే విధంగా నిరసనలు తెలపడం తగదని వారించారు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. జోజు కారు అద్దాన్ని పగలగొట్టారు. 

ఈ సందర్భంగా జోజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇంధన ధరలు పెంపు అనేది చాలా పెద్ద విషయం. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశంపై నిరసన తెలపాలి. అయితే ఈ విధంగా మాత్రం కాదు. ప్రజలకు కష్టమవుతోంది. ఆసుపత్రికి వెళ్లాల్సిన వారు ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయారు’’ అని అన్నారు. మరోవైపు, కాంగ్రెస్‌ వాదన మరో విధంగా ఉంది. జోజు మద్యం సేవించి మహిళా కార్యకర్తలతో దురుసుగా మాట్లాడారని ఆరోపించింది. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకరన్‌ సైతం జోజుపై మండిపడ్డారు.

‘‘జోజు మద్యం సేవించి గూండాలా ప్రవర్తించారు’’ అని ఆరోపించిన కేరళ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధాకరన్‌.. అతడిపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  ఈ గొడవ జరిగిన అనంతరం త్రిపునితుర ప్రాంతంలోని ఓ ఆసుపత్రికి వెళ్లిన జోజు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయన మద్యం సేవించలేదని తేలింది. తాను గొడవలు కోరుకోవడం లేదని, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని ఈ సందర్భంగా జోజు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిరసనలు తెలపడం మాత్రం సరికాదని పునరుద్ఘాటించారు. ఇక, కారు అద్దం పగులగొట్టినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also read Bigg Boss Telugu 5: మానస్‌కి ధైర్యం లేదట.. బయటకు పంపిస్తే గేమెలా ఆడాలంటూ షణ్ముఖ్‌కి షాకిచ్చిన ప్రియాంక

‘ఘటనపై సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటాం.. ఆందోళనలకు రాతపూర్వకంగా ఎటువంటి అనుమతి తీసుకోలేదు.. నిరసనలు జరుగుతాయని మీడియా ద్వారా సమాచారం అందడంతో పోలీసులను మోహరించాం’ అని ఓ అధికారి తెలిపారు. అయితే, అరగంట పాటు నిరసన తెలపడానికి తాము పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నామని ఎర్నాకులం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మొహమూద్ షియాస్ అన్నారు.

Also read RRR glimpse: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, అజయ్‌ దేవగన్, అలియాలతో వర్క్ చేయడంపై రాజమౌళి హాట్‌ కామెంట్‌

click me!