సలార్ లో నా రోల్ అదే... పార్ట్ 2 ఉంటుందని చెప్పేసిన జగ్గూభాయ్!

Published : Jul 16, 2023, 03:56 PM ISTUpdated : Jul 16, 2023, 04:12 PM IST
సలార్ లో నా రోల్ అదే... పార్ట్ 2 ఉంటుందని చెప్పేసిన జగ్గూభాయ్!

సారాంశం

ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాల్లో సలార్ పై భారీ హైప్ ఉంది. ఈ మూవీలో కీలక రోల్ చేస్తున్న జగపతిబాబు ఆసక్తిక కామెంట్స్ చేశారు. ఆయన పార్ట్ 2 ఉంటుందని స్పష్టత ఇచ్చారు.   

సలార్ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ చిత్రంలో జగపతి కీలక రోల్ చేస్తున్నారు. మూవీలో తన పాత్రపై ఆసక్తికర విషయం బయటపెట్టారు. సలార్ రెండు భాగాలుగా విడుదల కానుందట. పార్ట్ 1లో తనకు ప్రభాస్ కి మధ్య ఎలాంటి కాంబినేషన్ సీన్స్ ఉండవట. పార్ట్ 2లో మాత్రంలో మా ఇద్దరి కాంబోలో అదిరిపోయే సన్నివేశాలు ఉంటాయని జగపతిబాబు చెప్పుకొచ్చారు.

సలార్ రెండు భాగాలుగా విడుదల కానుందని ప్రచారం జరిగింది కానీ అధికారిక ప్రకటన లేదు. జగపతిబాబు స్పష్టత ఇచ్చారు. సలార్ కి సీక్వెల్ ఉందని తేలిపోయింది. సలార్ అనంతరం ప్రశాంత్ నీల్ హీరో ఎన్టీఆర్ తో మూవీ చేయాల్సి ఉంది. సలార్ సీక్వెల్ ఉంటే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే సూచనలు కలవు. ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 ప్రకటించారు. వార్ 2 తర్వాత ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందేమో ... 

ఇక సలార్ మూవీలోప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. మలయాళ స్టార్ పృథ్వి రాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన సలార్ టీజర్ అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టింది. తక్కువ సమయంలో వంద మిలియన్ వ్యూస్ దాటేసింది. సలార్ చిత్రంపై జనాల్లో ఉన్న క్రేజ్ కి ఇదే నిదర్శనం. 

సలార్ విడుదలైన మూడు నెలల్లో ప్రాజెక్ట్ కే విడుదల కానుంది. ప్రభాస్ నటిస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జులై 20న శాన్ డియాగో కామిక్ కామ్ ఈవెంట్ వేదికగా సలార్ టైటిల్, ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్ కే మూవీకి నాగ్ అశ్విన్ దర్శకుడు. కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్, దిశా పటాని వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ