
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. కు షాక్ ఇచ్చింది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్. పఠాన్ సినిమాతో చాలా కాలం తరువాత సూపర్ హిట్టు అందుకున్నాడు షారుఖ్. ఈ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు షారుఖ్.ఈ మూవీతో తాను కమ్‌బ్యాక్ ఇవ్వడమే కాకుండా.. చాలా కాలంగా హిట్ సినిమా లేకుండా.. ఇబ్బందుల్లో పడిపోయిన బాలీవుడ్ ను కూడా పఠాన్ సినిమాతో ఆదుకున్నాడు షారుఖ్.ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేయడానికి చాలా ప్రయత్నించింది పఠాన్.
ఇక భారీ అంచనాలు.. భారీ రెస్పాన్స్ తో.. ఈ యాక్షన్ మూవీ ఫైనల్ గా పఠాన్ 1000 కోట్ల మార్క్ ని అందుకొని బాలీవుడ్ కి కొంచెం ఊరటని ఇచ్చింది. సరిగ్గా ఇదే టైమ్ లో.. ఈ కలెక్షన్స్ నిజమైనవేనా.. అనే అనుమానం కూడా బయటకు వచ్చింది. అవన్నీ ఫేక్ అంటూ కూడా వార్తలు వినిపించాయి. భారీ అంచనాలతో పాటు.. భారీ వ్యతిరేకత కూడా మూటగట్టుకున్న ఈ సినిమా.. సౌత్ లో పెద్దగా మార్కెటింగ్ జరగలేదు. అయినా వెయ్యి కోట్లు సాధించడం సాధ్యమేనా అనే అనుమానాలు రేకెత్తాయి. అంత కాదు బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేసిందంటూ చెప్పుకోవడంతో.. ఈ మూవీ కలెక్షన్స్ ఫేక్ అంటూ గట్టి కామెంట్సే వినిపించాయి.
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఈ మూవీ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఫేక్ అంటూ స్వయంగా షాకింగ్ కామెంట్స్ చేసింది కాజోల్. తను నటించిన ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గోంటున్న కాజోల్.. షారుఖ్ గురించి మాట్లాడుతూ.. పఠాన్ నిజంగా ఎంత కలెక్ట్ చేసింది అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ KRK ట్వీట్ చేశాడు. ఇక బాలీవుడ్ వర్గం వాళ్లే పఠాన్ కలెక్షన్స్ ఫేక్ అంటూ కామెంట్స్ చేస్తుండడంతో సౌత్ ఆడియన్స్ బాలీవుడ్ పై ట్రోల్స్ చేస్తున్నారు.