53ఏళ్ల వయసులో చదువు కోసం ఆరాటపడుతున్న నటి హేమ

Published : Sep 27, 2020, 07:07 PM ISTUpdated : Sep 27, 2020, 10:55 PM IST
53ఏళ్ల వయసులో చదువు కోసం ఆరాటపడుతున్న నటి హేమ

సారాంశం

కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాలలో నటించిన నటి హేమకు చదువుపై మనసు మళ్లింది. 53ఏళ్ల వయసులో హేమ డిగ్రీ అర్హత పరీక్షలకు హాజరయ్యారు.   

నటి హేమ మనసు చదువు పైకి మళ్లింది. ఆమె డిగ్రీ పట్టాదారు కావాలనుకుంటున్నారు. అందుకు హేమ డిగ్రీ ఎంట్రన్స్ పరీక్షకు హాజరయ్యారు. నల్గొండ జిల్లాలోని ఓ పరీక్ష సెంటర్ లో పరీక్ష రాయడం జరిగింది. ఓ చిత్ర షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరలో ఉన్న హేమ బంధువుల ఇంట్లో ఉంటూ ఈ పరీక్షకు హాజరయ్యారట. రెండేళ్లుగా డిగ్రీ అర్హత పరీక్ష రాయాలని హేమ అనుకుంటున్నారట. ఐతే బిజీ షెడ్యూల్స్ వలన కుదరలేదట. ఈ ఏడాది డిగ్రీ కోర్స్ లో చేరడానికి హేమ అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్ష రాశారు. 

దీనితో పాటు కొన్ని కంప్యూటర్ కోర్స్ లు కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నారట. ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలుకు చెందిన హేమ సినిమాపై మక్కువతో టీనేజ్ లోనే పరిశ్రమకు వచ్చారు. 30ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉన్న హేమ వందల చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ రోల్స్ చేయడం జరిగింది. 

7వ తరగతి వరకు చదువుకున్న హేమ ఆ తరువాత సినిమా కోసం చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశారట. 53ఏళ్ల వయసులో హేమ ఉన్నత చదువులు చదవాలనుకోవడం విశేషం. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న హేమ మొదటివారమే ఎలిమినేటై వెళ్లిపోవడం జరిగింది. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యాక్షురాలిగా ఉన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Aishwarya Rajesh: ఇతరుల జీవితం మీకెందుకు? బ్లాక్ బస్టర్ హీరోయిన్ పోస్ట్ వైరల్
వాళ్ళ పక్కన మీరు ఆనరు, బాలయ్య ముఖం మీదే చెప్పిన డైరెక్టర్.. ఛాలెంజ్ చేసి మరీ ఇండస్ట్రీ హిట్ కొట్టిన నటసింహం