బాలు అభిమానుల కోసం స్మారకం...చరణ్ వెల్లడి

By Satish ReddyFirst Published Sep 27, 2020, 5:14 PM IST
Highlights

నిన్న చెన్నై శివారులోని తామరైప్పాక్కం ఫార్మ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాల మధ్య బాలు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఐతే బాలు అభిమానుల కోసం ఓ స్మారకం నిర్మించనున్నట్లు చరణ్ వెల్లడించారు.

లెజెండ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు శనివారం పూర్తి అయ్యాయి. చెన్నై శివార్లలోని బాలు కుటుంబానికి చెందిన తామరైప్పాక్కం ఫార్మ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాల మధ్య బాలు అంత్యక్రియలు పూర్తి చేశారు. హీరో విజయ్, దేవిశ్రీ, భారతీరాజా వంటి ప్రముఖులు బాలు అంత్యక్రియలకు హాజరయ్యారు. బాలు అంత్యక్రియల తరువాత ఆయన కుమారుడు చరణ్ మీడియాతో మాట్లాడారు. 

చరణ్ మాట్లాడుతూ ,నాన్న ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన కోలుకున్నారు, తామరైప్పాక్కం ఫార్మ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు'  అన్నారు. గత 50రోజులుగా నాన్నగారు కోలుకోవాలని ప్రార్ధనలు చేసిన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక బాలు అభిమానుల కోసం చరణ్ ఓ స్మారకాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో బాలు అభిమానుల సందర్శనార్థం ఓ పెద్ద స్మారకం నిర్మించాలనేది తన ఆలోచన అని చరణ్ వెల్లడించారు. 

ఈ విషయంపై చరణ్ ప్రణాళికలు వేస్తున్నారట. బాలు అంత్యక్రియలు నిర్వహించిన తామరైపాక్కం ఫార్మ్ హౌస్ లోనే నిర్మించనున్నారట. ఈ విషయాన్ని మీడియా ద్వారా చరణ్ వెల్లడించడం జరిగింది. సుదీర్ఘ కాలం ఆసుపత్రిలో కోవిడ్ తో పోరాటం చేసిన బాల సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25న శుక్రవారం తుదిశ్వాస విడిచారు. బాలు మృతికి దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. 
 

click me!