జర్నలిస్టుగా గొల్లపూడి... అప్పట్లోనే గడగడలాడించాడు

By Nagaraju penumala  |  First Published Dec 12, 2019, 2:34 PM IST

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు విద్యాభ్యాసం పూర్తైన తర్వాత జర్నలిస్ట్ గా పనిచేశారు. జర్నలిజంలో విలేకరిగా మెుదలైన ఆయన ప్రస్తానం సంపాదకుడు వరకు వెళ్లింది. అనంతరం రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాతగా మారారు. 
 


హైదరాబాద్: ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు విద్యాభ్యాసం పూర్తైన తర్వాత జర్నలిస్ట్ గా పనిచేశారు. జర్నలిజంలో విలేకరిగా మెుదలైన ఆయన ప్రస్తానం సంపాదకుడు వరకు వెళ్లింది. అనంతరం రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాతగా మారారు. 

గొల్లపూడి మారుతీరావుకు తెలుగు సాహిత్యం అంటే ఎనలేని ఇష్టం. తెలుగు సాహిత్యం అభివృద్ధికి ఎంతో కృషి చేసేవారు. సినీ రంగంలోకి అడుగుపెట్టకముందు ఆయన నాటకాలు, కథలు, నవలలు రచించారు కూడా. 

Latest Videos

అనంతరం 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1960 జనవరి 13వ తేదీ చిత్తూరులో ఆంధ్రప్రభ నూతన ఎడిషన్ ప్రారంభించినప్పుడు అక్కడ సంపాదక వర్గంలో పనిచేశారు. 

అనంతరం రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికవ్వడంతో ఆయన మకాం హైదరాబాదుకు మార్చారు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశారు గొల్లపూడి మారుతీరావు. ఆకాశవాణిలో పలు పదోన్నతులు పొందారు. సంబల్‌పూర్ లో కూడా పనిచేశారు. 

Gollapudi Maruti Rao: రూ.100 బహుమతి గొల్లపూడి జీవితాన్నే మలుపుతిప్పింది...

ఆ తర్వాత చెన్నై, కడప కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టరుగా పదోన్నతి పొందాడు. 25ఏళ్ల అనంతరం అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. 

తెలుగు సాహిత్యంపై ఆయన రచించిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.   

అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించారు గొల్లపూడి మారుతీరావు. డా.చక్రవర్తి సినిమాకి స్క్రీన్ ప్లే అందించిన గొల్లపూడి మారుతీరావు అనంతరం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినిమారంగ ప్రవేశం చేశారు. 

గొల్లపూడి మారుతీరావు: మెుదటి సినిమా చిరంజీవితోనే...

ఇకపోతే గొల్లపూడి మారుతీరావు రచనా ప్రస్థానం విషయానికి వస్తే ఆయన రాసిన తొలికథ ఆశాజీవి. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడు లో 1954, డిసెంబరు 9న ఈ కథ వెలువడింది. చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున గొల్లపూడి మారుతీరావు నాటక బృందాన్ని సైతం నిర్వహించేవారు. 

నటుడిగా, రచయితగా ఇలా ఎన్నో రంగాల్లో విశేష సేవలందించిన గొల్లపూడి మారుతీరావు గురువారం చెన్నై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోరజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. 

గొల్లపూడి మారుతీరావు మరణంతో టాలీవుడ్ తోపాటు పలువురు సాహితీవేత్తలు సైతం దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. గొల్లపూడి మారుతీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 

డబ్బు చాలా వచ్చేది కానీ.. ఆర్థిక పరిస్థితిపై గొల్లపూడి ఏమన్నారంటే?...
 
 

click me!