హీరోయిన్ పూర్ణ, రవిబాబు మధ్య ఎఫైర్.. ఇదిగో క్లారిటీ!

pratap reddy   | Asianet News
Published : Nov 11, 2021, 06:10 PM IST
హీరోయిన్ పూర్ణ, రవిబాబు మధ్య ఎఫైర్.. ఇదిగో క్లారిటీ!

సారాంశం

రవిబాబు టాలీవుడ్ విభిన్నమైన నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నెగటివ్ పాత్రల్లో నటించినప్పటికీ తనదైన శైలిలో కామెడీ పంచ్ లతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం రవిబాబు స్టైల్. 

రవిబాబు టాలీవుడ్ విభిన్నమైన నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నెగటివ్ పాత్రల్లో నటించినప్పటికీ తనదైన శైలిలో కామెడీ పంచ్ లతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం రవిబాబు స్టైల్. నచ్చావులే, మనసారా, నువ్విలా, అవును లాంటి విజయవంతమైన చిత్రాలు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కాయి. 

ఇక Ravi babu నటుడిగా టాలీవుడ్ లో చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు. ఇక చిత్ర పరిశ్రమలో దర్శకులు, హీరోలు, హీరోయిన్లపై రూమర్లు సహజంగానే పుట్టుకొస్తుంటాయి. రవిబాబుపై కూడా ఒక రూమర్ ఉంది. రవిబాబు దర్శకత్వంలో హీరోయిన్ పూర్ణ మూడు చిత్రాల్లో నటించింది. అవును, అవును 2, లడ్డుబాబు చిత్రాల్లో రవిబాబు.. పూర్ణకు అవకాశం ఇచ్చారు. 

దీనితో వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతోందని.. Poorna పై ఇష్టంతోనే ఆమెకు అన్ని అవకాశాలు ఇచ్చారు అంటూ రవిబాబుపై వార్తలు వచ్చాయి. వీరిద్దరూ జోరుగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రవిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 

Also Read: దివి పరువాలపై నిలవలేకున్న కొంటె పైట... చోళీ లెహంగాలో నడుము, నాభీ అందాలతో బిగ్ బాస్ భామ రచ్చ!

తనకు హీరోయిన్లకు ఎలాంటి సంబంధం లేదని రవిబాబు అన్నారు. షూటింగ్ అయిపోయాక వాళ్లెవరో నేనెవరో అన్నట్లుగా ఉంటాను. హీరోయిన్లతో మాట్లాడడం కానీ, వాళ్లకు ఫోన్లు చేయడం కానీ చేయను. నాపై వస్తున్న రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదు. విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని నేను. పూర్ణ నటన చూసే ఆమెని మూడు చిత్రాల్లో తీసుకున్నట్లు రవిబాబు క్లారిటీ ఇచ్చారు. 

Also Read: Poorna: వింటేజ్‌ లుక్‌లో నడువొంపులు, చిలిపి పోజులతో కైపెక్కిస్తున్న `ఢీ` పూర్ణ.. అందాల ఘాటు మామూలుగా లేదుగా

నేను హీరోయిన్ల వెంటపడే దర్శకుడినే అయితే నా దర్శకత్వంలో నటించేందుకు ఏ హీరోయిన్ కూడా ఒప్పుకోదు అని అన్నారు. రవిబాబు చివరగా రాజ రాజ చోర చిత్రంలో విలన్ గా నటించారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఆ మూవీ మంచి విజయం సాధించింది. నెగిటివ్ షేడ్స్ లో పోలీస్ అధికారిగా రవిబాబు పాత్ర ఆకట్టుకుంది. 

 

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?