తన మూవీ నుంచి బ్రహ్మానందంని తొలగించిన నితిన్.. షాకింగ్ రీజన్, రూ.50 లక్షలు లాస్ ?

pratap reddy   | Asianet News
Published : Nov 11, 2021, 04:05 PM IST
తన మూవీ నుంచి బ్రహ్మానందంని తొలగించిన నితిన్.. షాకింగ్ రీజన్, రూ.50 లక్షలు లాస్ ?

సారాంశం

బ్రహ్మానందంకు నితిన్ ఊహించని షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తన మాచర్ల నియోజకవర్గం మూవీ నుంచి నితిన్ బ్రహ్మీని తొలగించారట.   

యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం'. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఊహించని పరిణామం  చేసుకున్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఎంతటి బిజీ నటుడో అందరికీ తెలిసిందే. ఏక కాలంలో ఆయన చేతిలో పది చిత్రాలు ఉండేవి. కానీ ప్రస్తుతం బ్రహ్మీ సినిమాల సంఖ్య బాగా తగ్గించారు. 

వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల Brahmanandam తక్కువ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. అలాగే దర్శకులు బ్రహ్మీకి ప్రత్యామ్నాయంగా వేరే కమెడియన్స్ ని తీసుకోవడం కూడా మరో కారణం కావచ్చు. ఇదిలా ఉండగా బ్రహ్మానందం ప్రస్తుతం నితిన్ 'Macharma Niyojakavargam ' చిత్రంలో నటిస్తున్నాడు. వైజాగ్ లో 10 రోజుల షెడ్యూల్ కోసం కోసం చిత్ర యూనిట్ అక్కడకు వెళ్ళింది. 

ఈ షెడ్యూల్ లో బ్రహ్మీ తీరుకు Nithiin విసిగిపోయాడట. దీనితో ఈ చిత్రం నుంచి నితిన్ బ్రహ్మానందంని తొలగించినట్లు షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. షూటింగ్స్ కి ఆలస్యంగా రావడం.. డైరెక్టర్ చెప్పినట్లు చేయకపోవడంతో నితిన్ బ్రహ్మీపై ఫైర్ అయ్యారట. ఈ చిత్రం నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో తెరకెక్కుతోంది. బ్రహ్మానందం తీరు ఆగ్రహం తెప్పించేలా ఉండడంతో నష్టం వచ్చిన పర్వాలేదు అని నితిన్ ఈ చిత్రం నుంచి బ్రహ్మీని తొలగించారట. 

ఈ చిత్రం కోసం బ్రహ్మానందం రోజుకు 5 లక్షల పారితోషికం తీసుకుంటున్నారు. 10 రోజులకు మొత్తం రూ 50 లక్షలని నితిన్ ముందుగానే బ్రహ్మీకి చెల్లించినట్లు తెలుస్తోంది. బ్రహ్మీని తొలగించడం ద్వారా నితిన్ కు ఆ 50 లక్షలు లాస్ అని అంటున్నారు. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించలేదు. 

Also Read: Kangana ranaut: అతన్ని ప్రేమిస్తున్నాను, త్వరలో పెళ్లి ? పర్సనల్ విషయాలపై ఓపెన్ అయిన ఫైర్ బ్రాండ్ కంగనా

ఈ చిత్రంలో కేథరిన్, కృతి శెట్టి నితిన్ కి జోడిగా నటిస్తున్నారు. యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్ ఈ ఏడాది రంగ్ దే, చెక్, మ్యాస్ట్రో చిత్రాల్లో నటించాడు. ఈ చిత్రాల ద్వారా నితిన్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. రంగ్ దే పర్వాలేదనిపించగా.. చెక్ నిరాశపరిచింది. ఓటిటి వేదికగా విడుదలైన మ్యాస్ట్రో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్
Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌